తిరస్కార ఓటు ఉండాలి: సుప్రీం కోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ: ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులందర్నీ తిరస్కరించే హక్కు ఓటర్లకు ఉందని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు శుక్రవారం సంచలన తీర్పు చెప్పింది. ఎన్నికల సంస్కరణలకు సంబంధించి సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. అభ్యర్థులను తిరస్కరిస్తూ ఓటు వేసేందుకు అనుమతించాలని ఎన్నికల సంఘానికి ఆదేశించింది.
తిరస్కార ఓటుకు అనుమతించడం వల్ల ఎన్నికలలో పారదర్శకత పెరుగుతుందని, పార్టీలు మంచి అభ్యర్థులను పోటీలో నిలబెట్టేలా ప్రభావం పడుతుందని సుప్రీం కోర్టు పేర్కొంది.

పార్లమెంటులోను ఓటింగు సమయంలో తిరస్కార ఓటుకు అవకాశం ఉందని తెలిపింది. ఓటు వేయడం చట్టబద్దమైన హక్కు, అభ్యర్థులను తిరస్కరించడం ప్రాథమిక హక్కు అని న్యాయస్థానం పేర్కొంది.
పలు దేశాల్లో తిరస్కార ఓటు అమల్లో ఉందని ఈ సందర్భంగా పేర్కొంది. తిరస్కార ఓటు హక్కు వల్ల ఎన్నికలలో పారదర్శకత పెరుగుతుందన్నారు. ఈవిఎంలలో తిరస్కార బటన్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది.












Click it and Unblock the Notifications