నోట్ల రద్దుపై కుప్పలుగా కేసులు: సుప్రీంకు కేంద్రం

రూ.500, రూ.1000 నోట్ల రద్దు అనంతరం దేశవ్యాప్తంగా నెలకొన్న గందరగోళ పరిస్థితి పైన దాఖలైన కేసులకు సంబంధించిన పిటిషన్లను సుప్రీం కోర్టు బుధవారం విచారించనుంది.

న్యూఢిల్లీ: రూ.500, రూ.1000 నోట్ల రద్దు అనంతరం దేశవ్యాప్తంగా నెలకొన్న గందరగోళ పరిస్థితి పైన దాఖలైన కేసులకు సంబంధించిన పిటిషన్లను సుప్రీం కోర్టు బుధవారం విచారించనుంది. నోట్ల రద్దు, కొత్త కరెన్సీ పంపిణీ తీరును ఆక్షేపిస్తూ దేశంలోని పలు కోర్టుల్లో పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలయ్యాయి.

పెద్దనోట్ల రద్దు అంశంపై కేంద్రం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తమ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దేశవ్యాప్తంగా దాఖలైన అన్ని పిటిషన్లను ఒకే కోర్టుకు బదిలీ చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్లన్నీ సుప్రీం లేదా హైకోర్టుకు బదిలీ చేయాలని కోరింది. ఈ పిటిషన్‌ బుధవారం విచారణకు రానుంది.

SC to hear demonetisation transfer plea on Wednesday

ఎలాంటి ముందస్తు చర్యలు లేకుండా చలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను ఒకేసారి రద్దు చేయడం తగదని, రద్దు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కొందరు పిటిషనర్లు కోరగా, బ్యాంకుల ముందు క్యూ లైన్లలో చనిపోయిన వారి తరఫున మరికొందరు పిటిషన్లు దాఖలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+