వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధిక్కరణ కేసులో రాహుల్‌కు షాకిచ్చిన "సుప్రీం"

|
Google Oneindia TeluguNews

Recommended Video

Lok Sabha Election 2019 : ధిక్కరణ కేసులో రాహుల్‌కు షాకిచ్చిన 'సుప్రీం' || Oneindia Telugu

ఢిల్లీ : కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ రాఫెల్‌ కేసుపై చేసిన కామెంట్లు వెంటాడుతూనే ఉన్నాయి. తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పినా కోర్టు మాత్రం క్షమించే ప్రసక్తే లేదంటోంది. న్యాయస్థానం వ్యాఖ్యల్ని వక్రీకరించినందుకు కోర్టు ధిక్కరణ కేసు ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. రాఫెల్ వివాదంలో చౌకీదార్ చోర్ అంటూ ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరుతూ సుప్రీంకోర్టు రాహుల్‌కు నోటీసులు జారీ చేసింది.

అఫిడవిట్‌పై వివరణ ఇవ్వండి!.. సీజేఐ కేసులో లాయర్‌కు సుప్రీం నోటీసు!అఫిడవిట్‌పై వివరణ ఇవ్వండి!.. సీజేఐ కేసులో లాయర్‌కు సుప్రీం నోటీసు!

క్షమాపణ కోరిన రాహుల్

క్షమాపణ కోరిన రాహుల్

మరోవైపు రాహుల్ తరఫున వాదనలు వినిపించిన అభిషేక్ మను సింఘ్వీ చౌకీదార్ చోర్ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. అది ప్రచార జోరులో చేసిన రాజకీయ విమర్శే తప్ప కోర్టు వ్యాఖ్యల్ని వక్రీకరించే ఉద్దేశం ఏ మాత్రం లేదని చెప్పారు.ఇకపై ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటామని కోర్టుకు స్పష్టంచేశారు.

రాహుల్ క్షమాపణ కోరలేదన్న రోహత్గీ

రాహుల్ క్షమాపణ కోరలేదన్న రోహత్గీ

కోర్టు ధిక్కరణ పిటీషన్‌పై బీజేపీ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ రాహుల్ అఫిడవిట్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. అందులో చౌకీదార్ చోర్ హై వ్యాఖ్యలపై ఆయన క్షమాపణ చెప్పలేదని అన్నారు. ఒక అంశంపై విచారం వ్యక్తం చేయడం, క్షమాపణ కోరడానికి మధ్య చాలా అంతరం ఉందని రోహత్గీ కోర్టు దృష్టికి తెచ్చారు.

30వ తేదీకి విచారణ వాయిదా

30వ తేదీకి విచారణ వాయిదా

ఇరు పక్షాల వాదనలు రాహుల్ సమర్పించిన అఫిడవిట్‌లో ఇచ్చిన వివరణలో ఏ మాత్రం పశ్చాతాపం కనిపించడంలేదని జస్టిస్ రంజన్ గొగోయ్‌తో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. రాహుల్ చర్యను కోర్టు ధిక్కరణగా ఎందుకు భావించకూడదో లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. రాఫెల్ కేసుతో పాటు ఈ పిటీషన్‌పై వాదనలు వింటామన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఏప్రిల్ 30వ తేదీకి వాయిదా వేసింది.

English summary
Congress chief Rahul Gandhi, who landed in trouble for comments involving a Supreme Court order on the Rafale fighter jet deal, has been served a notice by the top court. Mr Gandhi had admitted yesterday that he had misquoted the Supreme Court after its ruling on the Rafale deal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X