కృష్ణా జలాలు: ఏపీ, టీ, కేంద్రానికి సుప్రీం నోటీసులు
హైదరాబాద్: కృష్ణా జలాల వివాదంలో మహారాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ పైన సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. కృష్ణా నది జలాల తీర్పును నోటిఫై చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేసింది.
మహారాష్ట్ర పిటిషన్ పైన కేంద్రం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సుప్రీం కోర్టు నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.

కాగా, కృష్ణా ట్రిబ్యునల్ తీర్పును అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ట్రైబ్యునల్ తీర్పు పైన తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది. వీటిని సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. తీర్పు అమలు పైన నాలుగు వారాల్లో ఏపీ, తెలంగాణ, కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.












Click it and Unblock the Notifications