అవినీతి కేసు: కేరళ సీఎంకు సుప్రీంకోర్టులో షాక్

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ/తిరువనంతపురం: అవినీతి కేసులో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) అభ్యర్థన మేరకు గురువారం ఆయనకు నోటీసులు జారీ చేసింది.

1997 నాటి ఎస్ఎన్‌సీ-లావలీన్‌ అవినీతి కేసులో పినరయి విజయన్‌ పాత్ర
ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆయనను నిర్దోషిగా తేలుస్తూ కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో సీబీఐ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. సీబీఐ అభ్యర్థనను మన్నించిన ధర్మాసనం పినరయితోపాటు మరో ఇద్దరు నిందితులకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో నోటీసులకు స్పందించాలని నిందితులకు స్పష్టం చేసింది.

 అవినీతి ఆరోపణలు

అవినీతి ఆరోపణలు

2013 నవంబర్ 5న, 1995లో సంకీర్ణ ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన విజయన్ రూ.374 కోట్లతో మూడు జల విద్యుత్ ప్రాజెక్టుల ఆధునీకరణ పనులుచేపట్టినప్పుడు కెనడా కంపెనీ ఎస్ఎన్‌సీ-లావలీన్ కంపెనీకి అనుకూలంగా వ్యవహరించారని ఆయనపై సీబీఐ అభియోగాలు నమోదు చేసింది.

 సాక్ష్యాలు లేవని..

సాక్ష్యాలు లేవని..

కానీ, వీరికి వ్యతిరేకంగా సాక్ష్యాలు లేకపోవటంతో విజయన్‌తో పాటు ఆరోపణలు ఎదుర్కున్న ఆరుగురిని సీబీఐ కోర్టు.. 2013 నవంబర్‌ 5న నిర్ధోషులుగా ప్రకటించింది. దీంతో సీబీఐ కేరళ హైకోర్టును ఆశ్రయించింది. అయితే పలువురు విద్యుత్‌ మంత్రులు ఎస్‌ఎన్‌సీ-లావలీన్‌తో సంప్రదింపులు సాగించినప్పటికీ.. సీబీఐ మాత్రం విజయన్‌ ఒక్కరినే నిందితుడిగా చేర్చిందని, అయితే, ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సమర్పించటంలో సీబీఐ పూర్తిగా విఫలమైందని చెబుతూ సీబీఐ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది.

 మరోసారి పినరయిపై విమర్శలు

మరోసారి పినరయిపై విమర్శలు

ఇది ఇలాగా ఉండగా, మరో విషయంలోనూ పినరయి విమర్శలను ఎదుర్కొంటున్నారు. కేరళలో ఇటీవల ఓఖీ తుఫాను బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ విపత్తు వల్ల కలిగిన నష్టంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి డిసెంబరు 26న కేంద్ర బృందంతో చర్చలు జరిపారు. తిరువనంతపురంలో ఈ సమావేశం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి పార్టీ సమావేశం నిమిత్తం ఛార్టెడ్‌ విమానంలో త్రిశూర్‌ వెళ్లారు. అయితే ఈ ఛార్టెడ్‌ విమాన ప్రయాణానికి రూ.8లక్షలు ఖర్చయింది. కాగా, ఈ మొత్తాన్ని విపత్తు నిర్వహణ నిధుల నుంచి తీసి చెల్లించినట్లు తెలిసింది. దీంతో ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తాయి.

 సీఎంకి తెలియదంటూ..

సీఎంకి తెలియదంటూ..

అయితే ఈ విషయం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ముందుగా తెలియదని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. తెలిసిన తర్వాత విచారణకు ఆదేశించినట్లు తెలిపాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Supreme Court on Thursday issued a notice to Kerala Chief Minister Pinarayi Vijayan in the SNC-Lavalin corruption case.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి