వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోదీ సర్కారుకు సీజేఐ రమణ మరో షాక్ -పెగాసస్ నిఘా కుట్రపై నోటీసులు -సుప్రీంకోర్టు అనూహ్య వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో.. ప్రస్తుత మోదీ సర్కారు పార్లమెంటును నడుపుతోన్న తీరు, అసలేముందో తెలియకుండానే కీలక బిల్లుల్ని ఆమోదించుకుంటోన్న వైనంపై ఆగ్రహావేదనలు వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ.. పార్లమెంట్ స్తంభనకు కారనమైన 'పెగాసస్ నిఘా ఉదంతం'లోనూ సంచలనానికి తెరలేపారు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన పెగాసస్ నిఘా కుట్ర అంశంపై సుప్రీంకోర్టులో దాఖలైన కేసుల్ని విచారిస్తోన్న సీజేఐ బెంచ్ మంగళవారం నాడు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అంతేకాదు, కేంద్ర తరఫు లాయర్ వాదనను సమర్థిస్తూ దేశ భద్రతపైనా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివరాలివి..

ఇండియాపై తాలిబన్ దాడి: యుద్ధానికి మోదీ సిద్ధంగా ఉండాలి -భారతమాత కోసం తప్పదన్న బీజేపీ స్వామిఇండియాపై తాలిబన్ దాడి: యుద్ధానికి మోదీ సిద్ధంగా ఉండాలి -భారతమాత కోసం తప్పదన్న బీజేపీ స్వామి

నిఘాపై కేంద్రానికి నోటీసులు

నిఘాపై కేంద్రానికి నోటీసులు


రాజకీయ, మీడియా తదితర వర్గాలకు చెందిన దాదాపు 500 మంది ప్రముఖులపై కేంద్ర ప్రభుత్వం నిఘాకు పాల్పడిందని, అందుకోసం ఇజ్రాయెల్ కు చెందిన ఎన్ఎస్ఓ సంస్థ తయారుచేసిన పెగాసస్ స్పైవేర్ ను కేంద్రం వినియోగించిందనే ఉదంతంపై తీవ్ర రాజకీయ దుమారం చెలరేగడం తెలిసిందే. పెగాసస్ అంశంపై దర్యాప్తు, ప్రభుత్వ వివరణను కోరుతూ విపక్షాలు రచ్చకు దిగడంతో ఇటీవలి పార్లమెంట్ సమావేశాలు రసాభసగా ముగియడం విదితమే. జర్నలిస్టులు, రాజకీయ నేతలు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, సామాజిక కార్యకర్తలపై కేంద్రం నిఘాకు పాల్పడిందనే ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ద్వారా గానీ, న్యాయ కమిటీ ద్వారా గానీ విచారణ జరపాలని కోరుతూ సీనియర్‌ జర్నలిస్టులు ఎన్‌.రామ్‌, శశికుమార్‌, ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నది. సోమవారం నాటి వాదనల్లో కేంద్రం తీరుపై విస్మయం వ్యక్తం చేసిన సీజేఐ బెంచ్, మంగళవారం నాటి విచారణలో కేంద్రం వాదనల్లో కొన్ని అంశాలకు అంగీకరిస్తూనే ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

మోదీ సర్కారుపై సీజేఐ రమణ సంచలన వ్యాఖ్యలు -ఏ చట్టం ఎందుకో తెలియట్లే -పార్లమెంట్ తీరుపై తీవ్ర ఆవేదనమోదీ సర్కారుపై సీజేఐ రమణ సంచలన వ్యాఖ్యలు -ఏ చట్టం ఎందుకో తెలియట్లే -పార్లమెంట్ తీరుపై తీవ్ర ఆవేదన

పెగాసస్ నిఘా.. జాతీయ భద్రత..

పెగాసస్ నిఘా.. జాతీయ భద్రత..

పిటిషనర్లు ఆరోపిస్తున్నట్లు రాజకీయ నేతలు, మీడియా, సామాజిక కార్యకర్తలపై పెగాసస్ స్పైవేర్ ద్వారా నిఘా ఉంచారా? లేదా? అసలు కేంద్రం పెగాసస్‌ స్పైవేర్‌ను వాడిందా? లేదా? అన్న ప్రశ్నకు పదే పదే సమాధానం దాటవేసిన కేంద్రం.. సదరు అంశాలను ప్రజలందరికీ బహిర్గతం చేయలేమని కుండబద్దలు కొట్టింది. అంతేకాదు, పెగాసస్ గానీ మరో స్పైవేర్ గానీ వాడటం అనేది జాతీయ భద్రతతో ముడిపడిన అంశం కాబట్టి, సంబంధిత వివరాలను నిపుణుల కమిటీకి మాత్రమే తెలియజేస్తామని, సదరు కమిటీనే సుప్రీంకోర్టుకు ఓ రిపోర్టు సమర్పిస్తుందని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. ''పెగాసస్ విషయంలో ఇప్పటికే ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటన చేసింది. నిజంగా దాన్ని వాడామని బహిరంగా ఒప్పుకుంటే అది దేశ భద్రతకు ఇబ్బందికర పరిణామం అవుతుంది. ఉగ్రవాదులు, వాళ్లు నడిపంచే స్లీపర్ సెల్స్ అప్రమత్తమై, కేంద్రం నిఘా నుంచి జారుకునే ప్రమాదం ఉంది. కాబట్టే మేం పెగాసస్ పై లోతైన వివరాలేవీ నేరుగా కోర్టుకు అందించలేం. అయితే సంబంధిత విషయాలన్నీ నిపుణుల కమిటీకి నివేదిస్తాం'' అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. దీనికి..

ఇబ్బంది అనుకుంటే ఇవ్వొద్దు, కానీ..

ఇబ్బంది అనుకుంటే ఇవ్వొద్దు, కానీ..

పెగాసస్ స్పైవేర్ ను కేంద్రం వాడిందా లేదా అని స్పష్టంగా చెప్పకుండా, అది జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని సొలిసిటర్ జనరల్ పదే పదే చెప్పడంపై సీజేఐ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''దేశ భద్రత విషయంలో కేంద్రంగానీ, సుప్రీంకోర్టుగానీ, పిటిషనర్లుగానీ రాజీపడాల్సిన అవసరం లేదు. అలా చేయాలని మేం కూడా చెప్పట్లేదు, పిటిషనర్లూ కోరట్లేదు. నిజంగా పెగాసస్ వ్యవహారం నేషనల్ సెక్యూరిటీ అంశంగా భావించినట్లయితే ఆ వివరాలను ప్రభుత్వం కోర్టుకు నేరుగా వెల్లడించాల్సిన అవసరం లేదు. అలాగని పిటిషనర్ల హక్కులను కూడా మేం కాలరాయలేం. కాబట్టి..

సీజేఐ బెంచ్ సమాలోచన.. విచారణ వాయిదా

సీజేఐ బెంచ్ సమాలోచన.. విచారణ వాయిదా

పెగాసస్ అంశంలో జాతీయ భద్రతా పర్యవసానాలు ఇమిడి ఉన్నాయని.. ఒక సున్నితమైన అంశాన్ని సంచలనం చేయాలని ప్రయత్నిస్తున్నారని కేంద్రం తరఫు న్యాయవాది గట్టిగా వాదించడం, ఊహాగానాలతో.. నిర్ధారణ కాని నివేదికల ఆధారంగా పిటిషనర్లు కేసు వేశారని చెప్పిన నేపథ్యంలో అసలీ పిటిషన్లను ఎలా విచారించాలనేదానిపై సీజేఐ బెంచ్ సమాలోచనలు చేస్తున్నది. ''ఈ కేసులోని సంక్లిష్టతల దృష్ట్యా తదుపరి దీన్ని ఎలా విచారిస్తే బాగుంటుందో మేం ఆలోచించుకోవాలి. అందుకే విచారణను 10 రోజుల పాటు వాయిదా వేస్తున్నాం. అయితే, ప్రాథమికంగా ఈ ఆరోపణలు అన్నిటికీ బదులు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి కేంద్రానికి నోటీసులు ఇస్తున్నాం'' అని సీజేఐ రమణ, జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ అనిరుద్ధ బోస్ ల ధర్మాసం వ్యాఖ్యానించింది.

కేంద్రం, సుప్రీం, పిటిషన్ల ఏకాభిప్రాయం

కేంద్రం, సుప్రీం, పిటిషన్ల ఏకాభిప్రాయం

మోదీ సర్కారు పెగాసస్ స్పైవేర్ వాడిందా? లేదా? అనే విషయాన్ని ఒక్క ముక్కలో స్పష్టం చేస్తే సరిపోతుందని, ఇదే అంశంపై అటు ఇజ్రాయెల్ లో ప్రభుత్వం సోదాలు నిర్వహించి విచారణ చేపట్టిన దరిమిలా ఎన్ఎస్ఓ సంస్థ సాధికారతపై అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందని, అసలు ఇజ్రాయెల్ ప్రభుత్వానికి తెలిసే ఇది జరిగిందా? అనేది వెల్లడి కావాల్సి ఉందని పిటిషన్ల తరఫు లాయర్ కపిల్ సిబల్ అన్నారు. తాము క్లారిటీ మాత్రమే కోరుతున్నామని, దేశ భద్రత విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేనంత వరకే కేంద్రం నుంచి సమాధానాలు కోరుతున్నామని చెప్పారు. మొత్తంగా దేశ భద్రత అంశంలో రాజీ పడాల్సిన అవసరం లేదని విషయంలో కేంద్రం, సుప్రీంకోర్టు, పిటిషన్లు ఏకాభిప్రాయానికి వచ్చారు. అయితే తదుపరి వాయిదాలో ఈ కేసును సీజేఐ బెంచ్ ఎలా విచారిస్తుందనేది ఉత్కంఠగా మారింది.

English summary
The Supreme Court on Tuesday issued notice to the Central government in the batch of petitions seeking probe into the Pegasus snoopgate. A Bench of Chief Justice of India NV Ramana and Justices Surya Kant and Aniruddha Bose also said that the Bench needs to deliberate further on how to proceed with the matter and adjourned the hearing for ten days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X