వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

18న సుప్రీంకోర్టుకు క్యాబ్ పిటిషన్ల విచారణ...? ఐయూఎంఎల్ సహా పదుల సంఖ్యలో..

|
Google Oneindia TeluguNews

పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య భారతదేశంలో నిరసనజ్వాల ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. రహదారులపై ఆందోళన చేపడుతున్నారు. క్యాబ్‌పై ఇప్పటికే టీఎంసీ ఎంపీ మహూవా సహా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అన్నీ పిటిషన్లను కలిపి ఈ నెల 18న సర్వోన్నత న్యాయస్థానం విచారించే అవకాశం ఉన్నది.

మైనార్టీలకు నష్టం లేదు, శరణార్థుల హక్కుల కోసమే, క్యాబ్ బిల్లుపై రాజ్యసభలో అమిత్ షామైనార్టీలకు నష్టం లేదు, శరణార్థుల హక్కుల కోసమే, క్యాబ్ బిల్లుపై రాజ్యసభలో అమిత్ షా

యూనియన్ ముస్లిం లీగ్ సహా పదుల సంఖ్యలో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటినీ బుధవారం విచారిస్తామని సుప్రీంకోర్టు సంకేతాలు ఇచ్చింది. మరోవైపు గువహటిలో బ్రాడ్ బ్యాండ్ సేవలను పునరుద్ధరించారు గానీ ఇంటర్నెట్ సేవలపై సస్పెన్షన్ కొనసాగుతుంది. కర్ఫ్యూను కూడా సడలించారు. గువహటిలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు డిబ్రూఘడ్‌లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సడలించారు. ఈ మేరకు పోలీసులు కూడా మైకుల ద్వారా ప్రజలకు చెప్తున్నారు.

SC likely to hear CAB pleas on December 18

దోమ్జూర్‌లోని సలాప్ వద్ద గల జాతీయ రహదారిపై కొందరు ఆందోళన కారులు టైర్లకు నిప్పు పెట్టారు. పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగారు. అంతకుముందు ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మలను కూడా దహనం చేశారు. కోపోద్రిక్తులైన ఆందోళనకారులు ప్రైవేట్ బస్సులను కూడా ధ్వంసం చేశారు.

English summary
The petition filed by the Indian Union Muslim League is likely to be heard by the Supreme Court on December 18. The court may also hear around a dozen petitions related to CAB on the day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X