214 బొగ్గు క్షేత్రాల కేటాయింపులు రద్దు, జరిమానా
న్యూఢిల్లీ: 1993 నుండి కేటాయించిన 214 బొగ్గు క్షేత్రాలను భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు బుధవారం రద్దు చేసింది. ఇప్పటి వరకు 218 బొగ్గు క్షేత్రాలకు అనుమతించారు. ఇందులో నాలుగు ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించారు. ఈ నాలుగింటిని మినహాయించి 214 బొగ్గు క్షేత్రాలను రద్దు చేసింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.
బొగ్గు గనుల కేటాయింపునకు ఎలాంటి ప్రాతిపదిక లేదని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. మైన్స్ కేటాయింపు ఏకపక్షంగా జరిగాయని ఆక్షేపించింది. గనుల కేటాయింపుల్లో సీబీఐ దర్యాఫ్తు కొనసాగుతుందని తెలిపింది.

46 గనుల లీజుదారులు ఆరు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. 46 గనులలో మైనింగ్ చేస్తున్నందున వారు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. 214 బొగ్గు క్షేత్రాలకు జరిమానా విధించింది. టన్నుకు రూ.295 చెల్లించాలని ఆదేశించింది. ఈ రెండు వందల పద్నాలుగు బొగ్గు క్షేత్రాలను మళ్లీ వేలం వేసుకోవచ్చునని తెలిపింది.
కాగా, క్షేత్రాలను రద్దు చేయాలనుకుంటే 218 లైసెన్సులు రద్దు చేయవచ్చని అటార్నీ జనరల్ కొద్ది రోజుల క్రితం కోర్టుకు చెప్పిన విషయం తెలిసిందే. 218 బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో 80 క్షేత్రాలను రద్దు చేసినట్లు తెలిపారు. మిగిలిన 138 క్షేత్రాల్లో 40 కోల్ బ్లాక్స్‌లో మైనింగ్ ప్రారంభమైందని చెప్పారు. వాటికి సంబంధించిన కేంద్రాలు ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. 40తో పాటు మరో ఆరింటిలో మైనింగ్ మొదలవ్వనప్పటికీ ప్లాంట్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.












Click it and Unblock the Notifications