రామమందిర నిర్మాణ వివాదాన్ని త్వరగా తేల్చలేం: సుప్రీంకోర్టు
అయోధ్యలో రామమందిర నిర్మాణం విషయాన్ని త్వరగా తేల్చేసే విషయమై సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ విషయమై బీజెపి సీనియర్ నాయకుడు సుబ్రమణ్యస్వామి పిటిషన్ ను దాఖలు చేశాడు.
న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర నిర్మాణం విషయాన్ని త్వరగా తేల్చేసే విషయమై సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ విషయమై బీజెపి సీనియర్ నాయకుడు సుబ్రమణ్యస్వామి పిటిషన్ ను దాఖలు చేశాడు.
ఈ పిటిషన్ ను త్వరగా విచారించాలని సుప్రీంకోర్టును సుబ్రమణ్యస్వామి కోరాడు.అయితే ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించే విషయమై నిరాకరించింది సుప్రీంకోర్టు.

ఈ కేసులో సుబ్రమణ్యస్వామి ఒక పార్టీ అనే విషయం తమకు తెలియదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.అసలు ఈ కేసు దాఖలు చేయడానికి మీకున్న అర్హత ఏమిటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
ఇప్పటికిప్పుడే ఈ కేసును విచారించేందుకుగాను తమకు సమయం లేదని కోర్టు తేల్చి చెప్పింది. దీంతో రామమందిరం వివాదం గురించి తన వాదనలను విన్పించేందుకు స్వామికి అవకాశం ప్రస్తుతానికి లేదు.












Click it and Unblock the Notifications