నిత్యానందకు లైంగిక పటుత్వ పరీక్షలు తప్పవు: సుప్రీం

లైంగిక దాడుల కేసులు పెరుగుతున్న ప్రస్తుత వాతావరణంలో నిందితులకు లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించడం కీలకంగా మారాయని చెప్పింది. లైంగిక దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తి పరీక్ష నుంచి తప్పించుకోజాలడని చెప్పింది.
2010లో నిత్యానంద ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. లైంగిక పటుత్వ పరీక్షల నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని స్వామి నిత్యానంద పెట్టుకున్న దరఖాస్తును జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ తోసి పుచ్చింది. లైంగిక పరీక్షలంటే ఎందుకు అంతగా భయపడుతున్నారని సుప్రీంకోర్టు నిలదీసింది.
నిత్యానందకు లైంగిక పటుత్వ పరీక్షల నిర్వహణలో జాప్యం చేయడం పట్ల కోర్టు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటువంటి పరీక్షల్లో జాప్యం జరిగితే వ్యతిరేక ఫలితాలు వచ్చి నిందితులు తప్పించుకునే ప్రమాదం ఉంటుందని అభిప్రాయపడింది.












Click it and Unblock the Notifications