ట్రెండింగ్ లో సెల్ఫీ విత్ తిలక్: బొట్టు, విభూది పెట్టుకున్న వాళ్లను చూస్తే చాలా భయం: మాజీ సీఎం

బాగల్ కోట్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కర్ణాకట మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నుదుట పెద్ద బొట్టు పెట్టుకున్న వారిని చూస్తే.. తనకు చాలా భయం అని ఆయన బహిరంగంగా వ్యాఖ్యానించారు. హైందవాన్ని అడ్డుపెట్టుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటారని చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. హిందుత్వాన్ని కించపరిచేలా ఆయన కామెంట్స్ చేశారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. సెల్ఫీ విత్ తిలక్ అనే ఉద్యమాన్ని అప్పటికప్పుడు ఆరంభించింది బీజేపీ. ఆ హ్యాష్ ట్యాగ్ కాస్తా కొన్ని గంటల వ్యవధిలో ట్రెండింగ్ లో నిలిచింది.

కర్ణాటకలోని బాగల్ కోట్ జిల్లా బాదామిలో సిద్ధరామయ్య బుధవారం పర్యటించారు. కొన్ని అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. చెరువు పునరుద్ధరణ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. బాదామి సిద్ధరామయ్య సొంత నియోజకవర్గం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఈ స్థానం నుంచే గెలుపొందారు. సభలో ప్రసంగిస్తున్న ఆయన తిలకధారులను ఉద్దేశించి మాట్లాడారు. పెద్ద పెద్ద కుంకుమ బొట్లు, విభూది పెట్టుకొనే వాళ్లంటే తనకు భయమని అన్నారు. చెరువు పునరుద్ధరణ పనులను చేపట్టిన

‘Scared of people who wear tilak,’ says Karnataka former Siddaramaiah

కాంట్రాక్టర్ ఎవరని ప్రశ్నించగా సిద్ధరామయ్య ప్రశ్నించగా.. అధికారులు కాంట్రాక్టర్ ను చూపించారు. ఆ సమయంలో సదరు కాంట్రాక్టర్ నుదుటన పెద్ద బొట్టు పెట్టుకుని కనిపించారు. ఆయనను చేసిన వెంటనే సిద్ధరామయ్య ''కుంకుమ బొట్లు పెట్టుకొనే వాళ్లంటే నాకు భయం'' అని వ్యాఖ్యానించారు. నిర్దేశిత సమయంలోగా చెరువు పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని సూచించారు.

సిద్ధరామయ్య హిందువుల మనుభావాలు దెబ్బతీసేలా, హైందత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించారని అంటూ బీజేపీ నాయకులు ఆరోపించారు. గతంలో సిద్ధరామయ్య బొట్టు పెట్టుకున్న ఫొటోలను ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బొట్టు పెట్టుకున్న ఫొటోలను అప్ లోడ్ చేశారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి బగ్గా.. 'సెల్ఫీ విత్ తిలక్' అనే హ్యాష్ ట్యాగ్‌తో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బొట్టుతో ఫొటోలు దిగి ట్వీట్ చేయాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+