వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

airport: వీడి తెలివికి ఎయిర్ పోర్టు అధికారులు షాక్, అన్నీ క్లియర్, క్లైమాక్స్ లో విదేశీ కరెన్సీ ఎక్కడుందంటే ?

చాలా తెలివిగా దొంగలు, మోసగాళ్లు అక్రమంగా బంగారు, నగదు, నగలు తీసుకొచ్చి కస్టమ్స్ అధికారులకు పట్టుబడుతున్నారు. అక్రమంగా విదేశీ కరెన్సీ ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టి తీసుకు వెలుతున్న ప్రయాణికుడు అధికారులకు అడ్డంగా బుక్కైపోయా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ బెంగళూరు: విదేశాల నుంచి అక్రమంగా బంగారం, విదేశీ కరెన్సీలు విమానాల్లో తీసుకువస్తున్న వారి మీద భారతదేశంలో ఇటీవల ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయని వెలుగు చూస్తున్నాయి. చాలా తెలివిగా దొంగలు, మోసగాళ్లు అక్రమంగా బంగారు, నగదు, నగలు తీసుకొచ్చి కస్టమ్స్ అధికారులకు పట్టుబడుతున్నారు. దొంగలు చాప కింద నీరులా తెచ్చిన అధికారులు, పోలీసులు, సెక్యూరిటీ గార్డులు అన్ని ఆరా తీస్తే అసలు మ్యాటర్ బయటకు వస్తోంది. ఇదే సమయంలో అక్రమంగా విదేశీ కరెన్సీ ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టి తీసుకు వెలుతున్న ప్రయాణికుడు అధికారులకు అడ్డంగా బుక్కైపోయారు.

lady manager: బ్యాంకులో రూ. కోట్లు గోల్ మాల్ చేసిన మేడమ్, రెండు బ్రాంచ్ లో ఏం చేసిందంటే ?lady manager: బ్యాంకులో రూ. కోట్లు గోల్ మాల్ చేసిన మేడమ్, రెండు బ్రాంచ్ లో ఏం చేసిందంటే ?

అధికారులు షాక్

అధికారులు షాక్

భద్రంగా విదేశీ కరెన్సీ మూటగట్టుకుని బ్యాగ్ హ్యాండిల్ లో దాచిపెట్టుకుని విదేశీ తీసుకురావడంతో ఆ విషయం గుర్తించిన విమానాశ్రయ అధికారులుఆశ్చర్యానికి గురైనారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (డీఈఎల్) భద్రతా అధికారులు బ్యాంకాక్ వెలుతున్న ఓ ప్రయాణికుడి ట్రాలీ బ్యాగ్‌లోని మెటల్ పైపులలో రూ. 64 లక్షల విలువైన విదేశీ కరెన్సీని కనుగొని వాటిని స్వాధీనం చేసుకున్నారు.

హ్యాండిల్ బ్యాగ్ లో విదేశీ కరెన్సీ

హ్యాండిల్ బ్యాగ్ లో విదేశీ కరెన్సీ

ప్యాసింజర్ ట్రాలీ బ్యాగ్ హ్యాండిల్‌లోని బోలు పైపుల లోపల ఉన్న బ్యాగ్‌ను పరిశీలించిన అధికారులు విదేశీ కరెన్సీ నోట్లను మడతపెట్టి ప్లాస్టిక్‌లో చుట్టి ఉండడాన్ని గుర్తించారు. కస్టమ్స్ కార్యాలయంలోని సెక్యూరిటీ గార్డు బ్యాగ్ హ్యాండిల్‌ని తీసివేసి, పొడవాటి సూదితో వాయిదాల వారీగా నోట్లను బయటకు తీసిన వీడియో బయటకు రావడం హాట్ టాపిక్ అయ్యింది, యూరోలు, న్యూజిలాండ్ డాలర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

బ్యాంకాక్ వెళ్లిపోవాలని స్కెచ్

బ్యాంకాక్ వెళ్లిపోవాలని స్కెచ్

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సురిందర్ సింగ్ రిహాల్ అనే ప్రయాణికుడు వింత ప్రవర్తనను ప్రదర్శించాడు. తెల్లవారుజామున 1:15 గంటలకు ట్రాలీ బ్యాగ్‌ని తనిఖీ చేసినప్పుడు విమానాశ్రయ అధికారులకు మొదట అనుమానం వచ్చింది. నిందితుడు థాయ్ ఎయిర్‌లైన్స్ లో బ్యాంకాక్‌కు ప్రయాణించడానికి సిద్దం అయ్యాడు. స్క్రీనింగ్ కోసం దారి మళ్లించబడింది. భౌతిక మరియు ఎలక్ట్రానిక్ నిఘాలో అతని ప్రయాణాన్ని కొనసాగించడానికి అధికారులు అనుమతి ఇచ్చారు. అయితే సురిందర్ సింగ్ తన డాక్యుమెంట్‌లలో సమస్య కారణంగా ఎయిర్‌లైన్ చెక్ ఇన్‌ను క్లియర్ చేయలేనప్పుడు కస్టమ్స్ అధికారులు అతన్ని కస్టమ్స్ కార్యాలయానికి తీసుకెళ్లారు.

అడ్డంగా బుక్కైపోయాడు

సురిందర్ సింగ్ లగేజ్ బ్యాగ్ హ్యాండిల్ ను ఓపెన్ చేసిన అధికారులు అందులోని నుంచి విదేశీ కరెన్సీ బయటకు తియ్యడంతో అక్కడ ఉన్న సిబ్బంది హడలిపోయారు. ఈ కేసులో విదేశీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐఎస్ఎఫ్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఇంత పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీని తీసుకొచ్చినందుకు ప్రయాణికుడు సురిందర్ సింగ్ ఎలాంటి డాక్యుమెంటేషన్‌ను అందించలేకపోయాడు. తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం కస్టమ్స్‌ అధికారులకు అతన్ని అప్పగించినట్లు సీఐఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.

English summary
Scene reverses with bundles of foreign currency notes on trolley bag handle, entry of customs officials and CISF officials at the Delhi airport.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X