నేడే నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల!: తెలంగాణకు కూడా?
Recommended Video

నేడే నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల!
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం శనివారం మధ్యాహ్నం మీడియా సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలతోపాటు తెలంగాణ ఎన్నికల షెడ్యూల్‌ను కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులతో రెండ్రోజులుగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సమావేశమవుతున్నారు.

శనివారం తెలంగాణకు సీఈసీ సాంకేతిక నిపుణులు రానున్నారు. తెలంగాణలో ఓటర్ల జాబితా రూపొందించే విషయంలో సాంకేతిక సమస్యలను పరిశీలించనున్నారు.
అక్టోబర్ 8న ఓటర్ల తుది జాబితా విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. అయితే ప్రస్తుతం సాంకేతిక సమస్యలు వస్తున్నందున ఈ అంశంపై శుక్రవారం నాటి సమావేశంలో చర్చించి సాంకేతిక నిపుణులను సీఈసీ పంపిస్తోంది.












Click it and Unblock the Notifications