అత్యాచారయత్నం: విద్యార్థిని ఆత్మహత్య
కాన్పూర్: అత్యాచారం జరిగిందని అవమానంతో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని తన ప్రాణాలు తీసుకుంది. తన మీద అత్యాచారయత్నం జరిగిందని కుమిలిపోయిన ఆమె చివరికి ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు అన్నారు. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ జిల్లా లోని సూతన్ పర్వా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
సూతన్ పర్వా గ్రామంలో 16 ఏళ్ల బాలిక నివాసం ఉంటున్నది. ఈమె ఇంటర్ చదువుతున్నది. ఈ నెల 9వ తేదిన శివమ్ అనే యువకుడు బాలిక ఒంటరిగా ఉన్న విషయం గుర్తించాడు. తరువాత ఆమె ఇంటిలోకి చోరబడి అత్యాచారయత్నం చెయ్యడానికి విఫలయత్నం చేశాడు.

అయితే బాలిక తప్పించుకోవడంతో నిందితుడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. అప్పటి నుంచి ఆమె ఇంటిలోని నాలుగు గోడల మధ్య ఉంటూ కుంగిపోయింది. బుధవారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాలిక కాలేజ్ కు వెళ్లి వచ్చేటప్పుడు ఆమెను శివమ్ వేధించేవాడని కాన్పూర్ జిల్లా ఎస్పీ పుష్పాంజలి మాథూర్ తెలిపారు. శివమ్ గురించి బాలిక ఆమె కుటుంబ సభ్యులకు చెప్పిందని, అయితే అవమానం జరుగుతుందని వారు పోలీసులకు ఫిర్యాదు చెయ్యలేదని అన్నారు. బాలిక ఆత్మహత్యకు కారణం అయిన శివమ్ మీద కేసు నమోదు చేశామని, అతడు పరారీలో ఉన్నాడని వివరించారు.












Click it and Unblock the Notifications