School: అక్కడ స్కూల్స్ కు ఆదివారం కాదు శుక్రవారం సెలవు, దెబ్బకు కమిటీలు రద్దు, మనదేశంలో !

రాంచీ/.జార్ఖండ్: ముస్లీంలు ఎక్కువగా నివాసం ఉంటున్న ప్రాంతాల్లో ఉన్న ఉర్దూ స్కూల్స్ లో విద్యార్థుల వారం సెలవుల విషయంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గత రెండు సంవత్సరాలుగా ఆదివారం కాకుండా శుక్రవారం ఉర్దూ స్కూల్స్ కు సెలవు ఇస్తున్నారని, ఆదివారం స్కూల్ లో విద్యార్థులు చదువుకుంటున్నారని అధికారులకు సమాచారం అందింది. ఆదివారం కాకుండా విద్యాసంస్థలకు శుక్రవారం సెలవులు ఇస్తున్నారని విద్యాశాఖ అధికారులకు సమాచారం అందింది. మ్యాటర్ తెలుసుకున్న ప్రభుత్వం ఉర్దూ స్కూల్స్ కు శుక్రవారం సెలవు రద్దు చేసి ఆదివారం సెలవు ప్రకటించారు. ప్రభుత్వ ఆదేశాలతో ఉర్దూ స్కూల్స్ లో చదువుతున్న విద్యార్థుల కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు.

 ఉర్దూ స్కూల్స్

ఉర్దూ స్కూల్స్

జార్ఖండ్ లో చామతాడ జిల్లాలో అదిక శాతం ముస్లీం కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈ జిల్లాలో మాత్రమే 43 ఉర్దూ స్కూల్స్ ఉన్నాయి. ప్రభుత్వ ఆదీనంలో ఉన్న 43 ఉర్దూ స్కూల్స్ లో వేలాది మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. జార్ఖండ్ ప్రభుత్వం ఆ స్కూల్ లో పని చేస్తున్న టీచర్లు, ఉద్యోగులకు జీతాలు ఇస్తోంది.

 స్కూల్స్ కు శుక్రవారం సెలవు

స్కూల్స్ కు శుక్రవారం సెలవు

జార్ఖండ్ లోని చామతాడ జిల్లాలోని 43 ఉర్దూ స్కూల్స్ కు ఆదివారం కాకుండా శుక్రవారం సెలవు ఇస్తున్నారు. ప్రభుత్వ నియమాల ప్రకారం విద్యార్థులు, టీచర్లు, ఉద్యోగులకు ఆదివారం సెలవు తీసుకోవాలి. అయితే ఆదివారం కాకుండా విద్యాసంస్థలకు శుక్రవారం సెలవులు ఇస్తున్నారని విద్యాశాఖ అధికారులకు సమాచారం అందింది.

 రెండు సంవత్సరాల నుంచి ?

రెండు సంవత్సరాల నుంచి ?

గత రెండు సంవత్సరాలుగా ఆదివారం కాకుండా శుక్రవారం ఉర్దూ స్కూల్స్ కు సెలవు ఇస్తున్నారని, ఆదివారం స్కూల్ లో విద్యార్థులు చదువుకుంటున్నారని అధికారులకు సమాచారం అందింది. ఉర్దూ స్కూల్స్ లో చదువుతున్న విద్యార్థుల కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు అక్కడ పని చేసే టీచర్లు, సిబ్బంది ఆదివారం ఉద్యోగాలు చేసి శుక్రవారం స్కూల్స్ కు సెలవులు ఇస్తున్నారని విద్యాశాఖ అధికారులకు కొందరు ఫిర్యాదు చేశారు.

 అన్ని స్కూల్స్ కు శుక్రవారం సెలవు రద్దు.... కమిటీలు రద్దు

అన్ని స్కూల్స్ కు శుక్రవారం సెలవు రద్దు.... కమిటీలు రద్దు

ముస్లీంలు ఎక్కువగా నివాసం ఉంటున్న ప్రాంతాల్లో ఉన్న 43 ఉర్దూ స్కూల్స్ లో విద్యార్థుల వారం సెలవుల విషయంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. శుక్రవారం అందరూ కచ్చితంగా స్కూల్ కు రావాలని, ఆదివారం సెలవు తీసుకోవాలని జార్ఖండ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో ఇంతకాలం కొనసాగుతున్న స్కూల్ మేనేజ్ మెంట్, పరిపాలన విభాగం కమిటీలను ప్రభుత్వం రద్దు చేసింది.

 శుక్రవారం కచ్చితంగా స్కూల్ కు రావాలి

శుక్రవారం కచ్చితంగా స్కూల్ కు రావాలి

ఇదే సందర్బంలో జార్ఖండ్ లో కొన్ని జిల్లాల్లో ఉర్దూ స్కూల్స్ కు శుక్రవారం ఉన్న సెలవును రద్దు చేసి ఆదివారం సెలవు దినంగా ప్రకటిస్తూ జార్ఖండ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ తరువాత ప్రారంభం అయిన ఉర్దూ స్కూల్స్ ప్రభుత్వ నియమాలు పక్కన పెట్టి శుక్రవారం సెలవు ఇచ్చి ఆదివారం పని చేస్తున్నారని వెలుగు చూడటం జార్ఖండ్ లో హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+