వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

8 మందితో లేచిపోయిన కిలాడి ప్రిన్సిపాల్

|
Google Oneindia TeluguNews

రాజ్ కోట్: ప్రసిద్ధి చెందిన స్కూల్ లో ప్రిన్సిపాల్ గా పని చేసిన ధావల్ త్రివేది (43) రాసలీలలు రోజు రోజుకు బయటకు వస్తున్నాయని పోలీసు అధికారులు అంటున్నారు. 7 సంవత్సరాలలో ఈయన గారు 8 మందితో లేచిపోయాడు. రెండు లవ్ మ్యారేజ్ లు చేసుకున్నాడు.

ఇంటర్ చదువుతున్న 16 సంవత్సరాల వయస్సు ఉన్న ఇద్దరు విద్యార్థినిలను వారి హాస్టల్ నుంచి ఎత్తుకు వెళ్లి రెండు సంవత్సరాల పాటు రహస్య ప్రాంతంలో ఉన్నాడు. తరువాత సీఐడి పోలీసులు అతని ఆచూకి గుర్తించి గత సంవత్సరం జులై 14వ తేదిన అరెస్టు చేసి జైలుకు పంపించారు.

2008 నుంచి ఇప్పటి వరకు ఇతని మీద నమోదు అయిన కేసులు చూసి పోలీసులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ధావల్ త్రివేది మీద పోస్కో చట్టం కింద విచారణ జరుగుతున్నది. ఇతను పలు ప్రసిద్ది చెందిన స్కూల్ లలో పని చేశాడు.

అక్కడ ఇంటర్ చదువుతున్న విద్యార్థుల మీద కన్ను వేశాడు. వారిని హాస్టల్ నుంచి ఎత్తుకు వెళుతున్నాడు. వారి మీద లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. 2003లో త్రివేది ఒక అమ్మాయిని ఎత్తుకు వెళ్లి పెళ్లి చేసుకున్నాడు. అయితే వివాహం అయిన ఆరు నెలలకే ఆమె అనుమానాస్పదంగా మరణించింది.

తరువాత ఒక టీచర్ ను ఎత్తుకు వెళ్లి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అయితే త్రివేది అసలు రంగు తెలుసుకున్న ఆమె అతని తో విడాకులు తీసుకుంది. 2008 ఇద్దరు టీచర్లను వేరు వేరుగా వివాహం చేసుకున్నాడు. ఒకరిని ఆర్య సమాజపద్దతిలో పెళ్లాడాడు.

School Principal eloped with 8 women in 7 years

త్రివేది విషయం తెలుసుకున్న ఒక టీచర్ తండ్రి అతనితో విడాకులు ఇప్పించాడు. 2010లో సూరత్ కు చెందిన ఇద్దరు మహిళలను వేరే వేరుగా ఎత్తుకు వెళ్లి గుర్తు తెలియని ప్రాంతంలో మకాం వేసి కాపురం పెట్టాడు. రెండు సంవత్సరాల క్రితం 16 సంవత్సరాల ఇద్దరు విద్యార్థినులను ఎత్తుకు వెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఇదే కేసులో త్రివేది అరెస్టు కావడంతో అతని రాసలీలల లిస్ట్ బయటపడిందని సీఐడి అధికారులు చెప్పారు. ఇతను అరెస్టు కాకముందు పంజాబ్, చండీగడ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా రాష్ట్రాలలో తిరిగాడు. అన్ని చోట్ల ఎత్తుకు వెళ్లి పెళ్లి చేసుకున్నాడు.

ఇంటర్ విద్యార్థినిలలో ఒక అమ్మాయిని భార్యగా, ఒకరిని సోదరిగా చుట్టు పక్కల వారికి పరిచయం చేశాడు. త్రివేది మీద మహిళలను కిడ్నాప్ లు చేశాడని, పెళ్లి పేరుతో మోసం చేశాడని, విద్యార్థినుల మీద లైంగిక దాడికి పాల్పడ్డాడని పోస్కో చట్టం కింద కేసులు నమోదు చేశారు.

ప్రస్తుతం రాజ్ కోట్ సెంట్రల్ జైలులో ఉన్న త్రివేది బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాడు. అయితే అతనికి బెయిల్ ఇస్తే పారిపోతాడని సీఐడి అధికారులు కోర్టులో మనవి చేశారు.

English summary
Trial proceedings have begun against Trivedi, who was arrested from Punjab on July 14 last year. He was arrested two years after he abducted the class XI girls from their hostel in Padadhari.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X