వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాఠశాల వార్షికోత్సవంలో బాబ్రీ మసీదు కూల్చివేత ప్రదర్శన: దుమారం రేపుతోన్న విద్యార్థుల స్కిట్

|
Google Oneindia TeluguNews

మంగళూరు: అత్యంత వివాదాస్పదం, సున్నితమైన అంశం.. బాబ్రీ మసీదు కూల్చివేత. 29 సంవత్సరాల కిందట చోటు చేసుకున్న ఈ ఉదంతానికి సంబంధించిన ప్రకంపనలు తరచూ కనిపిస్తూనే వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో- ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం అదే అంశాన్ని విద్యార్థుల ద్వారా ప్రదర్శించింది. పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని విద్యార్థులు వేసిన ఆ స్కిట్.. ప్రస్తుతం దుమారం రేపుతోంది.

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. దక్షిణ కన్నడ జిల్లా మంగళూరు సమీపంలోని కల్కడలో ఉన్న శ్రీరామ విద్యాకేంద్ర ఉన్నత పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు ఈ స్కిట్ లో పాల్గొన్నారు. తెల్ల చొక్కాలు, కాషాయ రంగు ప్యాంట్లను ధరించి జై శ్రీరామ్, జై వీర హనుమాన్.. అంటూ నినాదాలు చేస్తూ బాబ్రీ మసీదు కూల్చివేత స్కిట్ ను ప్రదర్శించారు.

School Students of Karnataka enact Babri demolition, Union Minister Sadanand Gowda and Kiran Bedi looks on

బాబ్రీ మసీదు గుమ్మటానికి సంబంధించిన ఓ భారీ ఫ్లెక్సీని వేదిక మధ్యలో ఉంచారు. దాని చుట్టూ చేరిన పలువురు విద్యార్థులు గట్టిగా నినాదాలు చేస్తూ, దాన్ని చింపేయడంతో ఈ స్కిట్ ముగుస్తుంది. అత్యంత సున్నితమైన ఈ అంశాన్ని పాఠశాాల వార్షికోత్సవ కార్యక్రమంలో ప్రదర్శించడం ఒక ఎత్తయితే.. కేంద్రమంత్రి సదానంద గౌడ, పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ సమక్షంలోనే దీన్ని ప్రదర్శించడం మరో ఎత్తుగా భావిస్తున్నారు.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఆధ్వర్యంలో ఈ పాఠశాల నడుస్తున్నట్లు చెబుతున్నారు. కల్కడ్క ప్రభాకర్ భట్ అనే పేరు మీద ఏర్పాటైన ఓ ట్రస్ట్.. శ్రీరామ విద్యాకేంద్ర పాఠశాలను నిర్వహిస్తోంది. ఈ ట్రస్ట్ కు ఆర్ఎస్ఎస్ కర్ణాటక సంచాలక్ ద్వారా నిధులు అందుతున్నాయని అంటున్నారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి.. విద్యార్థులు ప్రదర్శించిన ఈ స్కిట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పలువురు కర్ణాటక కాంగ్రెస్ నాయకులు దీన్ని తమ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నారు.

English summary
Several activities were organised at Shri Ram Vidya Kendra in Mangaluru during the school’s sports festival on Sunday. In one of the activities, students were to charge at a big cardboard poster of the Babri Masjid and tear it apart while shouting slogans like ‘Jai Shri Ram’, a video that surfaced on social media showed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X