దారుణం: స్కూల్ దగ్గరలోనే అమ్మాయి తల నరికేశాడు
భోపాల్: మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. స్కూల్‌కు కాస్త దూరంలో ఓ వ్యక్తి యువతిని కత్తితో నరికి చంపేశాడు. భోపాల్‌కు 540 కిలోమీటర్ల దూరంలోని అనుప్పూర్‌లో జరిగింది. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం జరిగింది.
11వ తరగతి చదువుతున్న బాలిక బయోలజీ ప్రాక్టికల్ పరీక్షల కోసం గం.12.30కు స్కూల్‌కు హడావుడిగా వస్తోంది. ఆ సమయంలో ఒకతను కత్తితో ఆమె తలపై మూడుసార్లు దాడి చేశాడు.

ఆ తర్వాత అతను కత్తిని అక్కడే వదిలేసి పారిపోయాడు. స్కూల్ టౌన్‌కు బయట ఉంటుంది. అక్కడ చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు.
ఈ సంఘటనను దూరం నుంచి 63 ఏళ్ల ఓ టీచర్ చూశారు. కానీ కళ్లద్దాలు లేకపోవడంతో నిందితుడు ఎవరో స్పష్టంగా గుర్తించలేకపోయారు.
అయితే బాలికను కత్తితో నరుకుతున్నట్లుగా, ఆమె కిందపడినట్లుగా కనిపించింది. స్కూల్ యాజమాన్యం వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. కుటుంబ సభ్యులు ఒకరిని అనుమానించడంతో పోలీసులు విచారించారు.












Click it and Unblock the Notifications