ఫేస్‌బుక్ చూడొద్దని మందలింపు: కూతురు ఆత్మహత్య

Scolded by mom, Facebook addict hangs self
లక్నో: అదే పనిగా సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్న తన కూతుర్ని ఓ తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన ఆ కూతురు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తనను క్షమించమని తల్లిని కోరుతూ సూసైడ్ నోట్ రాసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్‌లో చోటు చేసుకుంది. నేటి యువతపై ఫేస్‌బుక్ ప్రభావం ఎంతవుందో ఈ ఘటనను గమనిస్తే అర్థమవుతుంది.

వివరాల్లోకి వెళితే.. బాధితురాలు సుష్మా గోస్వామి(24) ఢిల్లీలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో తన పాఠశాల విద్యను అభ్యసించింది. ఆ తర్వాత తన తల్లిదండ్రులు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు తరలివెళ్లడంతో వారితోపాటు గోస్వామి కూడా ఇక్కడికి వచ్చింది. గోరఖ్‌పూర్‌లోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ్(డిడియు) విశ్వ విద్యాలయం నుంచి గ్రాడ్యూయేట్ పట్టా పొందింది సుష్మా గోస్వామి.

తన చివరి ఏడాది పరీక్షలు ముగిసిన తర్వాత గత సెప్టెంబర్ 3న గోస్వామి ఫేస్‌బుక్ ఖాతాను సుష్మా తెరిచింది. అనాటి నుంచి కూడా సుష్మా ఫేస్‌బుక్ లోనే ఎక్కువ సమయం గడుపుతూ వచ్చింది. ఈ క్రమంలోనే తన సోదరుడు కూడా ఫేస్ బుక్ అకౌండ్ ఓపెన్ చేసి అతడు కూడా చాటింగ్ కోసం ఎక్కువ సమయం కేటాయించాడు. దీంతో తమ అవసరమైన పనులను వారిద్దరూ కూడా పక్కనపెట్టేశారు.

ఈ నేపథ్యంలో కొంత ఆగ్రహానికి గురైన సుష్మా గోస్వామి తల్లి ఆమెను ఆదివారం మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన సుష్మా, కుటుంబ సభ్యులందరూ ఆదివారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో తన గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తెల్లవారుజామున లేచిన కుటుంబ సభ్యులు తన గదికి వెళ్లి చూడగా సుష్మా గోస్వామి విగత జీవిగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తనను క్షమించమని తన తల్లిని కోరుతూ.. సుష్మా సూసైడ్ నోట్‌లో పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+