బెంగళూరులో గౌరీ లంకేష్ హత్య: స్కాట్లాండ్ పోలీసుల సహకారం, ఆరితేరిన అధికారులు !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: కన్నడ లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య కేసు దర్యాప్తులో సిట్ అధికారులు స్కాట్లాండ్ పోలీసుల సహకారం తీసుకోవాలని నిర్ణయించారని వెలుగు చూసింది. గౌరి లంకేష్ హత్య జరిగి 10 రోజులు అవుతున్నా హంతకుల పూర్తి వివరాలు సిట్ అధికారులకు చిక్కలేదు.

స్కాట్లాండ్ నుంచి నలుగురు పోలీసు అధికారులను బెంగళూరుకు రప్పించి దర్యాప్తులో వారి సహకారం తీసుకోవాలని సిట్ అధికారులు నిర్ణయించారని సమాచారం. గౌరి లంకేష్ లాంటి హత్య కేసుల దర్యాప్తులో ఆరితేరిన నలుగురు స్కాట్లాండ్ పోలీసు అధికారులు త్వరలో బెంగళూరు చేరుకుని దర్యాప్తు వేగవంతం చేస్తారని కన్నడ మీడియాలో వార్తలు ప్రసారం అయ్యాయి.

Scotland police officials assisting SIT team solve Gauri Lankesh murder case

పిస్తోల్ తో గౌరి లంకేష్ ను ఎలా కాల్చారు, ఆమె శరీరంలో ఎక్కడెక్కడ బుల్లెట్లు దిగాయి, షార్ప్ షూటర్లు ఎవరైనా హత్య చేశారా, ఆమె వ్యక్తిగతం ఏమిటి, బెంచ్ మార్క్ దర్యాప్తు విచారణలో స్కాట్లాండ్ పోలీసుల సహకారాన్ని తీసుకోవాలని సిట్ అధికారులు నిర్ణయించారని విశ్వసనీయ సమాచారం. ఈ విషయాన్ని సిట్ అధికారులు అధికారికంగా దృవీకరించ లేదు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Special Investigation Team (SIT) which investigating Veteran Journalist Gauri Lankesh's murder case has decided to take the help of Scotland Police, says the source.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి