వైభవంగా రెండో విడత పద్మ అవార్డుల ప్రదానం..!
దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాల రెండో విడత ప్రదానోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలు రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలను అందజేశారు. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు, కేంద్ర మంత్రులు, సైనికాధికారులు, కళాకారులు హాజరయ్యారు. అంతే కాకుండా విజేతల కుటుంబ సభ్యులు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, పలువురు గవర్నర్లు, ముఖ్య మంత్రులు కూడా పాల్గొన్నారు.
ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మొత్తం 139 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించిన విషయం తెలిసిందే. వీరిలో 7 మందికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మ భూషణ్,
113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించారు. అయితే ఏప్రిల్ 28న మొదటి విడతగా జరిగిన కార్యక్రమంలో మొత్తం 71 మందికి పద్మ పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ జాబితాలో ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ, గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్య నిపుణుడు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి సహా పలువురు సాహితీ, సామాజిక సేవా రంగాల ప్రముఖులు ఉన్నారు.

ఇక ఇప్పుడు రెండో విడత కార్యక్రమంలో మిగిలిన అవార్డు గ్రహీతలకు రాష్ట్రపతి అందజేశారు. రెండవ జాబితాలో ప్రముఖ నర్తకి, సినీనటి శోభనకు పద్మ భూషణ్ పురస్కారం లభించింది. భారతీయ నాట్యకళలకు ఆమె అందించిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం అందజేశారు. అలానే ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు లభించింది. ఏపీకి చెందిన వారిలో
వి. రాఘవేంద్రాచార్య పంచముఖి (సాహిత్యం, విద్య), ప్రొఫెసర్ కేఎల్ కృష్ణ (ఆర్థిక రంగంలో సేవలు, విద్య) పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు. ప్రముఖ కన్నడ నటుడు అనంత్ నాగ్ పద్మ భూషణ్ పురస్కారం లభించింది.
LIVE: President Droupadi Murmu presents Padma Awards 2025 at Civil Investiture Ceremony-II at Rashtrapati Bhavan https://t.co/TKxWl528v7
— President of India (@rashtrapatibhvn) May 27, 2025












Click it and Unblock the Notifications