Second wife: సవితి బిడ్డలు ఆస్తిలో వాటా అడుగుతారని, పెళైన రెండు నెలలకే చిన్నమ్మ ఏం చేసిందంటే !
బెంగళూరు/ విజయపుర: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు పుట్టారు. పిల్లలతో కలిసి దంపతులు సంతోషంగా జీవనం సాగిస్తున్నారని అందరూ అనుకున్నారు. అయితే అందరి అంచనాలు తల్లకిందులైనాయి. కరోనా సెకండ్ వేవ్ సమయంలో భార్య అనారోగ్యంతో ప్రాణాలు వదిలేసింది. ఇద్దరు చిన్నపిల్లలతో కలిసి అతను మూడు నెలలు జీవించాడు. పిల్లలను చూసుకోవడానికి తల్లి అవసరం అని రెండు నెలల క్రితమే అతను రెండో పెళ్లి చేసుకున్నాడు. వివాహం జరిగిన రెండు నెలలకే కసాయి మహిళ దెయ్యం లాగా ప్రవర్తించింది. తన భర్త మొదటి భార్య పిల్లలు బతికుంటే వాళ్లు పెద్ద అయిన తరువాత ఆస్తిలో భాగం అడుగుతారని, వాళ్లను తాను ఎందుకు పెంచిపోషించాలని అనుకున్న కసాయి మహిళ వాళ్లను చంపేయాలని స్కెచ్ వేసింది. మొబైల్ ఫోన్ చార్జర్ తో ఐదేళ్ల బిడ్డను చంపేసింది. మరో చిన్నారి మీద దాడి చేసినా దేవుడి దయవల ఆ బిడ్డ ప్రాణాలతో బయటపడ్డాడు. పెళ్లి జరిగిన రెండు నెలలకే సవతి బిడ్డను చంపేసిన మహిళ విషయం తెలుసుకున్న స్థానికులు హడలిపోయారు.

దంపతులకు ఇద్దరు కొడుకులు
కర్ణాటకలోని విజయపుర జిల్లాలోని మించెనాళా తాండాలో వినోద్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. బంధువుల అమ్మాయి శారాభాయి అనే మహిళను ఆరు సంవత్సరాల క్రితం వినోద్ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న వినోద్, శారాభాయి దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు సుమిత్ చౌహ్హాన్ (5), సంతప్ చౌహ్హాన్ (3) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

భార్య ప్రాణం పోయింది
ఇద్దరు పిల్లలతో కలిసి వినోద్, శారాభాయి దంపతులు సంతోషంగా జీవనం సాగిస్తున్నారని అతని కుటుంబ సభ్యులతో పాటు ఊరందరూ అనుకున్నారు. అయితే అందరి అంచనాలు తల్లకిందులైనాయి. కరోనా సెకండ్ వేవ్ సమయంలో వినోద్ భార్య శారాభాయి అనారోగ్యానికి గురికావడంతో ఆమెకు వైద్యం చేయించారు. అయితే ఐదు నెలల క్రితం చికిత్స విఫలమై శారాభాయి చికిత్స విఫలమై ప్రాణాలు వదిలేసింది.

రెండు నెలల క్రితం రెండో పెళ్లి
భార్య శారాభాయి చనిపోవడంతో ఇద్దరు చిన్నపిల్లలతో కలిసి వినోద్ మూడు నెలలు జీవించాడు. నీ కోసం కాకపోయినా చిన్న బిడ్డల కోసం నువ్వు పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులు వినోద్ కు చెప్పారు. కుటుంబ సభ్యులు బంధువులు ఒత్తిడి చెయ్యడంతో రెండు నెలల క్రితం వినోద్ కుటుంబ సభ్యులు సవితా (22) అనే యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు.

సవితి బిడ్డలు ఆస్తిలో భాగం అడుగుతారని ?
వివాహం జరిగిన రెండు నెలలకే కిరాతకురాలు సవితా దెయ్యం లాగా ప్రవర్తించింది. తన భర్త వినోద్ మొదటి భార్య శారాభాయి ఇద్దరు పిల్లలు బతికుంటే వాళ్లు పెద్ద అయిన తరువాత తన భర్త ఆస్తిలో భాగం అడుగుతారని, వాళ్లను తాను ఎందుకు ఇప్పటి నుంచి పెంచిపోషించాలని అనుకున్న కసాయి మహిళ సవితా ఇద్దరు బిడ్డలను చంపేయాలని స్కెచ్ వేసింది.

మొబైల్ చార్జర్ తో బిడ్డను చంపేసింది
ఇంట్లో ఉన్న రెండో భార్య సవితా దగ్గర ఇద్దరు కొడుకులను వదిలిపెట్టిన వినోద్ బయటకు వెళ్లాడు. ఆ సమయంలో మొబైల్ ఫోన్ చార్జర్ తో ఐదేళ్ల బిడ్డ సుమిత్ గొంతు బిగించి చంపేసింది. మరో చిన్నారి సంపత్ చాతి మీద దాడి చేసింది. అయితే సంపత్ దేవుడి దయవల ప్రాణాలతో బయటపడ్డాడు. ఇంటికి వెళ్లిన వినోద్ తన బిడ్డను రెండో భార్య సవిత చంపేసిందని తెలుసుకుని వేదనతో రగిలిపోయాడు.
Recommended Video

కిరాతకురాలు అందర్
పెళ్లి జరిగిన రెండు నెలలకే సవతి బిడ్డను చంపేసిన సవిత విషయం తెలుసుకున్న స్థానికులు హడలిపోయారు. సవితి బిడ్డను చంపేసిన సవితను విజయపుర జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. చాతీలో తీవ్రగాయాలైన సంపత్ కు విజయపుర జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications