మధురమీనాక్షీ ఆలయం క్రింద బయటపడిన సొరంగ మార్గం .. భారీ నిధి నిక్షేపాలు ?
దేశంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన మదురై మీనాక్షి అమ్మవారి ఆలయానికి సంబంధించిన ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. శక్తి స్వరూపిణిగా ,మహిమలు ఉన్న అమ్మగా పేరు ప్రఖ్యాతులు ఉన్న ఈ ఆలయం కింది భాగంలో ఒక నేలమాళిగ బయటపడటం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశం అవుతుంది. తమిళనాడులోని మీనాక్షీ అమ్మవారి ఆలయానికి ఉన్న పేరు ప్రఖ్యాతులు అంతా ఇంతా కాదు .
ఇక అసలు విషయం ఏమిటంటే మదురై మీనాక్షీ గుడికి దగ్గరగా కారు పార్కింగ్ ఏర్పాటు చేసేందుకు కొద్ది నెలలుగా పనులు జరుగుతున్నాయి. మీనాక్షి అమ్మవారి ఆలయం సమీపంలో బహుళస్థాయి కార్ పార్కింగ్ కోసం జరుగుతున్న పనుల సందర్భంగా మధ్యయుగ స్తంభం లాంటి నిర్మాణాన్ని వారు కనుగొన్నట్లు కార్పొరేషన్ అధికారులు తెలిపారు . నిర్మాణ స్థలంలో పురాతన స్తంభం లాంటి నిర్మాణాన్ని దానితో పాటు రహస్య సొరంగ మార్గాన్ని కనుగొన్నారు. దీంతో.. అదే ప్రాంతంలో మరింత లోతుగా తవ్వకాలు జరుపుతుండగా బయటపడిన నేలమాళిగపై ఇప్పుడు చర్చ జరుగుతుంది .

తవ్వకాలలోపురాతన స్తూపం, 10 అడుగుల ఎత్తు ఉన్న ఓ మండపం, దాని కింద నుంచి సొరంగ మార్గం వెలుగులోకి వచ్చాయి. ఈ మార్గం ఆలయం లోపలి నుంచి ప్రారంభమై ఎక్కడి వరకు వెళ్తుందో ఇంకా తెలియలేదు . గతంలో ఈ ప్రాంతాన్ని పాలించిన రాణి మంగమ్మాళ్ దీన్ని నిర్మించి ఉండవచ్చని పురాతన శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇక ఈ సొరంగంలో భారీగా నిధి నిక్షేపాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.
ఇక సొరంగం బయట పడటంతో తవ్వకాలను నిలిపివేసిన అధికారులు, విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు . దీంతో రంగంలోకి దిగిన పురావస్తు శాస్త్రవేత్తలు ఈ సొరంగం రహస్యాన్ని తేల్చే పనిలో ఉన్నారు. అయితే పురావస్తు శాఖ దీన్ని ఆధీనంలోకి తీసుకోవటంతో పార్కింగ్ నిర్మాణం పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఏది ఏమైనా రహస్య సొరంగ మార్గం , భారీ నిధి ఉన్నట్టు జరుగుతున్న ప్రచారం మాత్రం లోపల ఏముంది అన్న ఆసక్తిని కలిగిస్తుంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications