నా సీనియారిటీ, సిన్సియారిటీ చూసి సీఎం పదవి ఇచ్చారు. ఫ్రీగా ఇచ్చారా ?
బెంగళూరు/హుబ్బళి: నేను ఎవరు కాళ్లు పట్టుకుని సీఎం, మంత్రిని కాలేదని, తన సీనియారిటీ, సిన్సియారిటీ చూసి ఆ పదవులు వచ్చాయని కర్ణాటక మాజీ సీఎం, బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ సీఎం జగదీష్ శెట్టర్ సంచలన వ్యాఖ్యలు చేశాను. తాను ఎక్కడ గెలిచిపోతానో అనే భయంతో బీజేపీ నాయకులు దిక్కులేనంత డబ్బు ఓటర్లకు ఇచ్చారని జగదీష్ శెట్టర్ ఆరోపించారు.
హుబ్బళి-ధారవాడ సెంట్రల్ నియోజక వర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన మాజీ సీఎం జగదీష్ శెట్టర్ మరోసారి పోటీ చెయ్యడానికి బీజేపీ హైకమాండ్ అవకాశం ఇవ్వలేదు. ఎవరు ఎన్ని చెప్పినా, బీజేపీ హైకమాండ్ బుజ్జగించినా వెనక్కి తగ్గని జగదీష్ శెట్టర్ కాంగ్రెస్ పార్టీలో చేరి అదే పార్టి టిక్కెట్ తో హుబ్బళి-ధారవాడ సెంట్రల్ నియోజక వర్గం నుంచి పోటీ చేశారు.

తన మీద బీజేపీ నాయకులు గెలవడానికి ఒక్కక్క ఓటరకు రూ. 1,000 వరకు ఇచ్చారని, ఇన్ని ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన తాను ఎప్పుడూ ఓటర్లకు డబ్బులు పంపిణి చెయ్యలేదని, తాను చేసిన మంచి పనులు చూసి ఇంతకాలం ప్రజలను తనను గెలిపిస్తూ వచ్చారని, ఇప్పుడు కూడా తనను ఆ ప్రజలే గెలిపిస్తారని, భారీ మెజారిటీతో తాను విజయం సాధిస్తానని జగదీష్ శెట్టర ధీమా వ్యక్తం చేశారు.
సిద్దరామయ్య, డీకే శివకుమార్ కలిసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశారని, బీజేపీ అవినీతి గురించి ప్రజలకు వివరించారని, ఆ ఇద్దరి ఆధ్వర్యంలో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మాజీ సీఎం జగదీష్ శెట్టర్ జోస్యం చెప్పారు. లింగాయుత్ కులానికి బీజేపీ చాలా అన్యాయం చేసిందని, అందులో తాను బలి అయ్యానని జగదీష్ శెట్టర్ ఆరోపించారు.

ముస్లీంల రిజర్వేషన్లు కత్తిరించి వాటిని లింగాయత్, ఒక్కలిగులకు ఇచ్చారని, ఇది ఎన్నికల ట్రిక్ అని తెలుసుకున్న ప్రజలు బీజేపీ తగిన గుణపాఠం చెప్పారని జగదీష్ శెట్టర్ ఆరోపించారు. హుబ్బళి-ధారవాడ సెంట్రల్ నియోజక వర్గంలోని కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఉన్న వార్డుల్లో 70 శాతం కంటే ఎక్కువగా పోలింగ్ జరిగిందని, ముస్లీం సోదరులు అందరూ తనకే ఓటు వేశారని జగదీష్ శెట్టర్ ధీమాగా చెప్పారు.
తనకు మంత్రి పదవి ఇప్పించింది నేను అని కేంద్ర మంత్రి ప్లహ్లాద్ జోషి చెబుతున్నారని, అపద్దానికి కేరాఫ్ అడ్రస్ ఆయనే అని జగదీష్ శెట్టర్ మండిపడ్డారు. తాను బీఎల్ సంతోష్ ను మాత్రమే విమర్శించానని, తాను బ్రాహ్మణులు అందరిని విమర్శించానని తప్పుడు ప్రచారం చేశారని. హుబ్బళిలో బ్రాహ్మణలు అందరూ తనకే ఓటు వేశారని మాజీ సీఎం జగదీష్ శెట్టర్ అన్నారు. ఇదే సమయంలో కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ మీద కూడా జగదీష్ శెట్టర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
-
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications