Seema Haider: మరోసారి తల్లి కాబోతున్న నలుగురు పిల్లల తల్లి..
తన ప్రేమికుడు సచిన్ కోసం నలుగురు పిల్లలతో సహా ఇండియాకు వచ్చిన పాకిస్థాన్ మహిళ సీమా హైదర్ మరోసారి తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించారు. గ్రేటర్ నోయిడాలో నివసిస్తున్న సీమా హైదర్, సచిన్ దంపతులు ఇప్పుడు తమ మొదటి బిడ్డకు తల్లిదండ్రులు కాబోతున్నామని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తాను త్వరలో తల్లి కాబోతున్నానని, 2024 తమకు శుభవార్త తెస్తుందని సీమా హైదర్ చెప్పారు.
పాకిస్థాన్ కు చెందిన సీమా హైదర్ కు 2019లో ఆన్‌లైన్ షూటింగ్ గేమ్ PUBG గేమ్ ద్వారా సచిన్ మీనాతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో ప్రియుడికి కోసం నలుగురు పిల్లల్ని తీసుకుని ఇండియాకు వచ్చింది సీమా హైదర్. మొదటగా సీమా, సచిన్ నేపాల్‌లో కలుసుకున్నారు. సిమా హైదర్ సచిన్ మీనా కంటే ఎనిమిదేళ్లు పెద్ద. సీమా, సచిన్‌లను ఉత్తరప్రదేశ్ పోలీసులు 2023 జూలైలో అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించినందుకు అరెస్టు చేశారు.

సీమా హైదర్ పాక్ గూఢచారి కావచ్చనే అనుమానంతో పోలీసులు వారిని ప్రశ్నించారు. వారిద్దరికి కోర్టు బెయిల్ ఇచ్చింది. సీమా హైదర్ తాను తల్లి కాబోతున్నానని చెప్పడంతో సోషల్ మీడియాలో కొందరు ఆమెకు శుభాకాంక్షలు చెబుతుంటే. మరికొందరు అయితే ఆమెను ట్రోల్ చేస్తున్నారు. కాగా సచిన్ మీనా సీమా హైదర్ ను నవంబర్ లో సంప్రదాయ బద్ధంగా పెళ్లి చేసుకున్నాడు.
గ్రేటర్ నోయిడాలో సీమా హైదర్ కు సచిన్ మంగళసూత్రాన్ని కట్టాడు. దీంతో వారు శాశ్వతమైన వైవాహిక జీవితంలోకి అడుకు పెట్టారు. సీమా సచిన్ పాదాలను తాకి, అతని ఆశీర్వాదాలు తీసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.












Click it and Unblock the Notifications