చిద్దూ చుట్టూ ఎంపీలు: సోనియాకు చిరు, మంత్రులు నో

దీంతో స్పీకర్ వారికి పదే పదే విజ్ఞప్తి చేశారు. ఇవే చివరి సమావేశాలైనందున అడ్డుకోవద్దని, సమస్యలుంటే మాట్లాడుకుందామని, తన ఛాంబర్ కు రావాలని స్పీకర్ వారికి సూచించారు. అయితే, సీమాంధ్ర మంత్రులు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన ఆందోళనను కొనసాగించారు.
వారు వుయ్ వాంట్ జస్టిస్, సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. సభలో తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్య చిదంబరం సభలో తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్టు మాత్రమే ప్రకటించి కూర్చున్నారు. ఆయన కూర్చున్న వెంటనే స్పీకర్ షెడ్యూలులో ఉన్న మిగిలిన జాబితా ప్రకారం మంత్రుల పేర్లు చదువుతూ వెళ్లారు. ఆ ప్రకారం మంత్రులు కూడా తమకు సంబంధించిన బిల్లులను ప్రవేశపెట్టినట్టు ప్రకటించారు.
ఆ తర్వాత మళ్లీ ఆర్థిక శాఖ మంత్రి తాత్కాలిక బడ్జెట్ ప్రసంగం చేయడానికి ఉపక్రమించారు. అంతటితో సీమాంధ్ర మంత్రులు మరింత గట్టిగా నినాదాలు చేస్తూ చిదంబరం ప్రసంగానికి అడ్డుపడ్డారు. ఈ దశలో స్పీకర్ ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం కాబట్టి సభ్యులు సభ జరగడానికి సహకరించాలని కోరారు.
మీకు ఏమైనా సమస్యలు ఉంటే తర్వాత తమ చాంబర్‌కు వచ్చి తమ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పుకోవాలని కోరారు. ఈ 15వ లోకసభకు ఇదే చివరి సమావేశం కాబట్టి సభ జరగడానికి సహకరించాలని కోరారు. అయితే ఎంపీలు అలాగే నినాదాలు చేస్తూ, చిదంబరాన్ని చుట్టుముట్టారు. ఆయన మాత్రం తన ప్రసంగం కొనసాగించారు.
సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలు ఆందోళన చేస్తుండగా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ వారిని వారించారు. అయినా వారు తగ్గలేదు. జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications