పాక్ పీచాన్ని అలా అణచివేశాం

Pahalgam Terror Attack: ప్రపంచం మొత్తాన్నీ ఉలిక్కిపడేలా చేసిన ఉదంతం.. పహల్గామ్ ఉగ్రదాడి. 26 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల ఘాతుకానికి అమెరికా మొదలుకుని ఆఫ్ఘనిస్తాన్ దాకా దాదాపుగా అన్ని దేశాలు స్పందించాయి. భారత్‌కు అండగా నిలిచాయి. ఉగ్రవాద నిర్మూలనకు సహకరిస్తామని వెల్లడించాయి.

ఈ దిగ్భ్రాంతికర ఘటనను కేంద్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. పాకిస్తాన్‌పై కఠిన ఆంక్షలను విధించింది. ఇండస్ రివర్ ట్రీటీ సహా పలు కీలక నిర్ణయాలను అమలులోకి తీసుకొచ్చింది. అట్టారీ-వాఘా సరిహద్దు చెక్‌పోస్ట్‌ను మూసివేయడమే కాకుండా దేశంలో నివస్తోన్న పాకిస్తానీయులనూ స్వదేశానికి వెళ్లిపోవాలంటూ ఆదేశించింది.

Self-reliance in UAVs and aerial systems strategic imperative for India says CDS Anil Chauhan

దీనిపై తాజాగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ డ్రోన్లు, విధ్వంసక మందుగుండు సామగ్రిని ఉపయోగించడాన్ని భారత సైన్యం విజయవంతంగా అడ్డుకున్న తీరును వివరించారు. ఈ చర్యలో భారత్ కు ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలిపారు.

ఢిల్లీలో జరిగిన డిఫెన్స్ వర్క్‌షాప్‌లో అనిల్ చౌహాన్ మాట్లాడారు. మే 10న పాకిస్తాన్ నిరాయుధ డ్రోన్‌లు, విధ్వంసక మందుగుండు సామగ్రిని ఉపయోగించిందని, వాటిలో ఏ ఒక్కటి కూడా భారత సైనిక లేదా పౌర మౌలిక సదుపాయాలకు నష్టం కలిగించలేదని అన్నారు. పాక్ ప్రయోగించిన డ్రోన్లను నిర్వీర్యం చేశామని, కొన్నింటిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు.

మానవరహిత వైమానిక వాహనాల వ్యూహాత్మక వినియోగం, స్వదేశీ కౌంటర్ డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని చౌహాన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. యుద్ధంలో డ్రోన్ల వినియోగం పరిణామాత్మకమైనదని, వాటి వినియోగం యుద్ధంలో చాలా విప్లవాత్మకమైనదని వ్యాఖ్యానించారు.

వాటి వినియోగం, పరిధి పెరిగే కొద్దీ సైన్యం డ్రోన్లను విప్లవాత్మక పద్ధతిలో ఉపయోగించడాన్ని ప్రారంభించామని అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. రక్షణ వ్యవస్థలో విదేశీ పరిజ్ఞానం కంటే సొంత సాంకేతికపైనే ఆధారపడాల్సిన అవసరం ఉందని, అది అన్నింటికీ సమాధానం చెబుతుందని అన్నారు.

యుద్ధ రీతిలో వచ్చిన విస్తృత చారిత్రక మార్పును వివరించారు. యుద్ధ రీతుల్లో వచ్చిన పరిణామాత్మక మార్పులు.. ఆయుధాలను మరింత సరళీకరించాయని వ్యాఖ్యానించారు. యుద్ధ పరికరాలను చిన్నవిగా, వేగంగా, తేలికగా, మరింత సమర్థవంతంగా, సరసమైనవిగా చేశాయని చెప్పారు.

గతంలో మన దగ్గర భారీ, బరువైన రైఫిల్స్ ఉండేవని, వాటిస్థానంలో ఇప్పుడు చిన్నవిగా, తేలికగా, ఎక్కువ రేంజ్ ను కలిగి ఉన్న అత్యాధునిక ఆయుధాలు వచ్చాయని చెప్పారు. యుద్ధ ట్యాంకులు, ఎయిర్ క్రాఫ్ట్ లకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుందని పేర్కొన్నారు. నిన్నటి ఆయుధాలతో నేడు యుద్ధం చేయలేమని స్పష్టం చేశారు. కాలానుగుణంగా అత్యాధునిక ఆయుధాలు తప్పవని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+