రాధే మా కొత్త డ్రామా: నాందెడ్ కు మకాం!

న్యూఢిల్లీ: అధ్యాత్మిక దేవత(గాడ్ వూమెన్)గా తనను తాను ప్రకటించుకున్న పరత్యాగిని రాధే మా అరెస్టు భయంతో మకాం మార్చడానికి సిద్దం అయ్యింది. వరకట్నం వేధింపుల కేసుతో పాటు ఇప్పుడు ఇంకోకరు ఫిర్యాదు చేయ్యడంతో ఆమె మహారాష్ట్రలోని నాందెడ్ కు పయనం అయ్యారు.

రాధే మా అలియాస్ సుఖ్వీందర్ కౌర్ (53) మీద ముంబైకి చెందిన నిక్కీ గుప్తా అనే మహిళ వరకట్నం వేదింపుల కేసు పెట్టింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఇదే సమయంలో రాధే మా షార్ట్ స్కర్ట్ లు వేసుకుని ఫోజు ఇచ్చిన ఫోటోలు బయటకు వచ్చాయి.

 Self-styled godwoman Mamtamai Radhe Maa,dowry harassment Case

గురువారం ఔరంగాబాద్ లోని ఒక హోటల్ లో ఉన్న రాధే మాను పోలీసులు గంట పాటు ప్రశ్నించి వివరాలు సేకరించారు. అయితే ఈ విషయంపై మాట్లాడటానికి పోలీసులు నిరాకరించారు. ఇక రాధే మా, ఆమె భక్తులు సైతం నో కామెంట్ అంటున్నారు.

ఇదే సమయంలో నిక్కీ గుప్తా స్నేహితుడు పంజాబ్ కు చెందిన సురేందర్ మిట్టల్ పోలీసులను ఆశ్రయించాడు. తాను నిక్కీ గుప్తాకు సహాయం చేస్తున్నానని తన మీద కక్షకట్టిన రాధే మా వేదింపులకు గురి చేస్తున్నదని ఆరోపిస్తూ అందుకు సంబంధించిన ఆడియో క్లిప్పింగ్ లను పోలీసులకు అందించారు.

 Self-styled godwoman Mamtamai Radhe Maa,dowry harassment Case

భక్తులను పరవశింపచెయ్యడానికి వారితో కలిసి రాధే మా అశ్లీల నృత్యాలు చేస్తున్నదని ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో రాధే మా మిని స్కర్టుల ఫోటోలు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఇంకో వ్యక్తి ఆమె మీద ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎక్కడ అరెస్టు చేస్తారో అనే భయంతో రాధే మా భక్తులతో కలిసి నాందెడ్ బయలు దేరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+