మాయవతికి చురక: 'మోడీ సెల్ఫీ రోగాన్ని అంటించారు'

లక్నో: సమాజ్‌వాది పార్టీ అత్యంత ఉదారవాద పార్టీ అని కావాలంటే తనతో ఎవరైనా సెల్ఫీ కూడా దిగవచ్చని ఉత్తరప్రదేశ్‌ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ పేర్కొన్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇటీవల సంగీత చౌదరి మహిళకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు గాను టికెట్‌ ఇచ్చారు.

ఆ ఆనందంలో ఆమె మాయావతితో కలిసి దిగిన ఫొటోని తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చేసింది. దీనికి ఆగ్రహించిన మాయావతి ఆ మహిళ టికెట్‌ని రద్దు చేశారు. వివరాల్లోకి వెళితే 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ తరుపు నుంచి పోటీ చేసేందుకు అట్రౌలీ నియోజక వర్గం నుంచి సంగీత చౌదరికి టికెట్ ఇచ్చారు.

Akhilesh Yadav

ఈ సందర్భంగా తనతో పాటు తన నలుగురు పిల్లలతో కలిసి మాయావతి పాదాలకు నమస్కరించే ఫోటోని ఆమె తన ఫేస్‌బుక్ పేజిలో పోస్టు చేశారు. అయితే ఈ ఫోటో ఆనాటో ఈనోటా పడి చివరికి మాయావతి దగ్గరకు చేరింది. దీంతో ఆగ్రహించిన మాయావతి సంగీత టికెట్‌ని రద్దు చేశారు. ఈ ఫోటో రగడపై అధినేత్రికి సంగీత క్షమాపణలు చెప్పిన ప్రయోజన లేకపోయింది.

దీనిపై అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ సోషల్ మీడియా వెబ్‌సైట్‌లో ఫోటోని అప్‌లోడ్ చేస్తే ఏం జరిగిందో పార్టీ కార్యకర్తలకు తెలియాలన్నారు. తమ సమాజ్‌వాది పార్టీ మాత్రం అలా కాదని చెప్పారు. ఎవరైనా సరే తనతో సెల్ఫీ దిగవచ్చని ఆయన స్పష్టం చేశారు.

కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ హయాంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రజకు 'సెల్పీ' అనే జబ్బును అంటించారని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. రానున్న పంచాయతీ, అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్ ను అభివృద్ధిపధాన నిలిపేందుకు ప్రతిపక్షాల వద్ద ఎలాంటి ప్రణాళిక లేదని ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+