రూ. లక్ష లంచం తీసుకున్నజడ్జి అరెస్టు
బెంగళూరు: సివిల్ కేసుకు సంబంధించి తీర్పు చెప్పడానికి లంచం తీసుకున్న జడ్జిని పోలీసులు అరెస్టు చేశారు. లంచం తీసుకుంటు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి సస్పెండ్ అయిన న్యాయమూర్తి శరణప్ప సజ్జన్ ను శనివారం పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
కర్ణాటకలోని బీదర్ జిల్లా బసవకల్యాణ మెజిస్ట్రేట్ కోర్టు సీనియర్ న్యాయమూర్తిగా శరణప్ప సజ్జన్ పని చేశారు. 2014 డిసెంబర్ నెలలో విచారణలో ఉన్న ఒక సివిల్ కేసు తీర్పు వెల్లడించడానికి కక్షిదారుడు కాశీనాథ్ ను రూ. ఐదు లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారని ఆరోపణలు ఉన్నాయి.

తరువాత బాధితుడు కాశీనాథ్ కర్ణాటక హై కోర్టు విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. బసవకల్యాణ పట్టణం సమీపంలోని నిర్జన ప్రదేశంలో న్యాయమూర్తి శరణప్ప సజ్జన్ అడ్వాన్స్ గా రూ. ఒక లక్ష లంచం తీసుకున్నారు.
అదే సమయంలో హై కోర్టు విజిలెన్స్ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని నగదు స్వాదీనం చేసుకున్నారు. విచారణలో న్యాయమూర్తి లంచం తీసుకున్నారని వెలుగు చూసింది. బీదర్ జిల్లాధికారి సుధీర్ కుమార్ ఆదేశాలతో శనివారం సింధనూరులో శరణప్ప సజ్జన్ ను పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications