వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆజాద్‌కు బీజేపీ బంపర్ ఆఫర్: ఆట మొదలైంది..!!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎన్నికల గడువు సమీపిస్తోంది. ఈ నెల 21వ తేదీన దీనికి సంబంధించిన ప్రక్రియ మొదలు కాబోతోంది. సుమారు నెల రోజుల పాటు ఇది కొనసాగుతుంది. సోనియా గాంధీ- ప్రస్తుతం ఏఐసీసీ తాత్కాలిక అధినేత్రిగా వ్యవహరిస్తోన్నారు. ఆమె స్థానంలో పూర్తిస్థాయిలో పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోనుంది కాంగ్రెస్ పార్టీ. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ వ్యవహారం కలవరపాటుకు గురి చేస్తోంది.

రాములమ్మకు ఏమైంది- పార్టీకి దూరంగా: అడ్డుపడుతోందెవరు..!!రాములమ్మకు ఏమైంది- పార్టీకి దూరంగా: అడ్డుపడుతోందెవరు..!!

ఆరోగ్య కారణాలతో..

ఆరోగ్య కారణాలతో..

జమ్మూ కాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రచార విభాగం ఛైర్మన్‌గా ఇప్పటికే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ప్రచార కమిటీ ఛైర్మన్‌గా ఆజాద్‌ను నియమిస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేసిన నాలుగైదు గంటల వ్యవధిలోనే ఆయన రాజీనామా చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆరోగ్య కారణాల వల్ల తాను రాజీనామా చేస్తోన్నట్లు చెప్పారు ఆజాద్. ఆ తరువాత కాంగ్రెస్ అధిష్ఠానానికి అందుబాటులో రాలేదని చెబుతున్నారు.

 జీ23లో కీలక నేతగా..

జీ23లో కీలక నేతగా..

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల్లో గులాం నబీ ఆజాద్ ఒకరు. కాంగ్రెస్ గ్రూప్- 23లో కీలక సభ్యుడు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌లో సంస్థాగత మార్పులను తీసుకుని రావాల్సిన అవసరం ఉందంటూ కొంతకాలంగా డిమాండ్ చేస్తూ వస్తోన్నారు. చాలాకాలంగా అదిష్టానం వైఖరిపై అసంతృప్తితో ఉంటోన్నారు. రాజ్యసభ పదవీ కాలాన్ని పొడగించకపోవడమే దీనికి కారణమనే అభిప్రాయాలు ఉన్నాయి. రాజ్యసభ సభ్యుడిగా పదవీ కాలం ముగిసిన తరువాత పెద్దగా పార్టీలో క్రియాశీలకంగా ఉండట్లేదు.

 ఆజాద్ వ్యవహారం..

ఆజాద్ వ్యవహారం..

తన రాజ్యసభ సభ్యత్వ పదవీ కాలాన్ని పొడిగించకపోవడం, ప్రధాన అనుచరుడిని పీసీసీ చీఫ్ పదవి నుంచి తొలగించడంతో ఇక ఆజాద్ పార్టీకి పూర్తిస్థాయిలో దూరమౌతారనే ప్రచారం కూడా సాగుతోంది. అధ్యక్ష ఎన్నికలకు ఏఐసీసీ సమాయాత్తమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో గులాం నబీ ఆజాద్ రాజీనామా వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారి తీయవచ్చనేది ఉత్కంఠభరితంగా మారింది. ఆయన వ్యవహారం కొరుకుడుపడని విధంగా తయారైంది.

 జగ్‌దీప్ ధన్‌కర్‌తో..

జగ్‌దీప్ ధన్‌కర్‌తో..

ఈ పరిణామాల మధ్య గులాం నబీ ఆజాద్.. ఈ మధ్యాహ్నం ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్‌ను కలుసుకున్నారు. ఇది మర్యాదపూరక భేటీ మాత్రమే. రాజకీయ ప్రాధాన్యత లేదనీ చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేసిన రెండో రోజే ఆయన జగ్‌దీప్ ధన్‌కర్‌ను కలుసుకోవడం చర్చనీయాంశమౌతోంది. పలు ఊహాగానాలకూ తావిచ్చినట్టయింది. కాంగ్రెస్‌కు వీడొచ్చనే ప్రచారానికీ ఇది కేంద్రబిందువయింది.

మోడీకి ఆప్తుడిగా..

మోడీకి ఆప్తుడిగా..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అత్యంత ఆప్తుడిగా ఆజాద్‌కు పేరుంది. ఆజాద్ రాజ్యసభ పదవీ కాలం ముగిసిన సమయంలో మోడీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్‌తో అంటీముట్టనట్టుగా ఉన్న ఈ పరిస్థితుల్లో ఆజాద్.. ఉప రాష్ట్రపతితో భేటీ కావడాన్ని రాజకీయ కోణంలోనే చూస్తోన్నారు విశ్లేషకులు. ఆజాద్‌ను గవర్నర్‌ పదవి అప్పగిస్తారనే ప్రచారం కూడా ఇప్పుడిప్పుడే మొదలైంది హస్తినలో. పశ్చిమ బెంగాల్‌కు గవర్నర్

English summary
Senior Congress Ghulam Nabi Azad meets Vice President Jagdeep Dhankhar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X