అసెంబ్లీకి ఫ్యామిలీ ప్యాక్ : తండ్రీ, కూతుళ్లు - తండ్రీ ,కుమారులు..!!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఎన్నికల ఫలితాల్లో ఆసక్తి కర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫ్యామిలీ ప్యాక్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఒకే కుటుంబంలోని రక్త సంబంధీకులు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇప్పుడు ఈ ప్యామిలీల గురించి రాజకీయంగా చర్చ సాగుతోంది. పార్టీల్లోని సీనియర్లు ఈ సారి పట్టుబట్టి తమ వారికి సీట్లు ఇప్పించుకున్నారు. అందులో గెలిచిన వారితో పాటుగా ఓడిన వారు ఉన్నారు. గెలిచిన వారిలో ప్రముఖులు వారి వారసులు నిలిచారు.
కాగా ఈ ఎన్నికల్లో ఆరుగురు అభ్యర్థులు తమ పిల్లలతో కలిసి పోటీ చేసి విజయం సాధించి సంచలనం సృష్టించారు. మరోవైపు లింగాయత్ సీనియర్ నాయకుడు షామనూరు శివశంకరప్ప 92 యేళ్ల వయసులో మరోసారి జయకేతనం ఎగరవేశారు.

దావణగెరె జిల్లాలో బలమైన లింగాయత్ నేత శివశంకరప్ప దావణగెరె సౌత్నుంచి గెలుపొందగా, దావణగెరె నార్త్ నుంచి ఆయన కుమారుడు ఎస్‌ఎస్ మల్లికార్జున విజయం సాధించారు. మల్లికార్జున 78,345 ఓట్లతో గెలుపొందగా, మరోవైపు దక్షిణాదిలో తండ్రి శామనూరు శివశంకరప్ప83,839 ఓట్లు సాధించి అఖండ విజయం సాధించారు.
బెంగళూరులోని విజయనగర్ నియోజకవర్గం నుంచి కృష్ణప్ప గెలుపొందగా, రాజానగర్‌లో ఆయన కుమారుడు ప్రియకృష్ణ గోవింద విజయం సాధించారు. దేవనహళ్లినియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత కేహెచ్ మునియప్ప గెలుపొందగా, కేజీఎఫ్‌నియోజకవర్గంలో ఆయన కుమార్తె రూపా కళాశశిధర్ విజయం సాధించారు.
బెంగళూరు అర్బన్ జిల్లాలోని బీటీఎం లేఅవుట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రామలింగారెడ్డి గెలుపొందగా ఆయన కుమార్తె సౌమ్యారెడ్డి జయానగర్‌లో విజయం సాధించారు. గంగావతి నుంచి గాలి జనార్ధన రెడ్డి గెలవగా, ఆయన సోదరుడు సోమశేఖరరెడ్డి ఓడిపోయారు. మాజీ సీఎం కుమార స్వామి గెలవగా, ఆయన కుమారుడు నిఖిల్ పరాజయం పాలయ్యారు.












Click it and Unblock the Notifications