తొక్కలో సర్వేలది ఏముంది అన్నా ?, కాబేయే సీఎం నేను, లీడర్ ధీమా !

బెంగళూరు/శివమొగ్గ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు రోజులు దగ్గరపడ్డాయి. పోలింగ్ తేది దగ్గర పడుతున్న కొద్ది వివిద పార్టీ నాయకులు సహనం కోల్పోతున్నారు. ఇప్పటికే విడుదల అయిన అనేక తొక్కలో సర్వేలు నమ్మకూడదని, వందకు వందశాతం కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి నేనే అంటూ జేడీఎస్ దళపతి, మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

కర్ణాటక ప్రజల ప్రయోజనాలను గాలికి వదిలేసిన బీజేపీ-కాంగ్రెస్ పార్టీల నాయకులు భజరంగ్ దళ్ కోసం పోట్లాడుకుంటున్నారని మాజీ సీఎం కుమారస్వామి మండిపడ్డారు. ఇప్పటికే విడుదల అయిన కొన్ని సర్వేల కారణంగా బీజేపీకి దిక్కుతోచని పరిస్థితి ఎదురైయ్యిందని. అందుకే ప్రజలను తప్పుదోవ పట్టించడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నదని మాజీ సీఎం కుమారస్వామి ఆరోపించారు.

HD Kumaraswamy

మేమే అధికారంలోకి వస్తామని బీజేపీ, లేదు మా మనిషి సీఎం అవుతారని కాంగ్రెస్ గొప్పలు చెప్పుకుంటున్నదని, అయితే దేవుడు ఆశీర్వాదం తనవైపు ఉందని, కచ్చితంగా నేనే ఇదే నెలలో కర్ణాటక ముఖ్యమంత్రి అవుతానని జేడీఎస్ నాయుకుడు హెచ్.డీ, కుమారస్వామి శివమొగ్గలో జరిగిన బహిరంగ సభలో ధీమా వ్యక్తం చేశారు.

శివమొగ్గలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన మాజీ సీఎం కుమారస్వామి బీజేపీ నాయకుల మీద విరుచుకుపడ్డారు. శివమొగ్గ జిల్లా చాలా పవిత్రమైనదని, ఇక్కడే కువెంపు జన్మించారని, ఇలాంటి పవిత్రమైన ప్రాంతంలో బీజేపీ నాయకులు రక్తపాతం ఎరులైపారేలా చేస్తున్నారని, రాజకీయ లాభం కోసం ఇంత దిగజారాలా అని మాజీ సీఎం కుమారస్వామి బీజేపీని ప్రశ్నించారు.

HD Kumaraswamy

శివమొగ్గలో జేడీఎస్ అభ్యర్థి ఆయనూరు మంజునాథ్ ను గెలిపిస్తే ఈ ప్రాంతంలో ఎన్నడూ జరగని అవృద్ది చేసి చూపిస్తానని నేను మాట ఇస్తున్నానని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా కర్ణాటకకు తానే కాబోయే ముఖ్యమంత్రి, అందులో ఎలాంటి డౌట్ లేదని మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామి జోస్యం చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+