Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కొత్త రికార్డులతో ప్రారంభమైన మార్కెట్లు, జోరుమీదున్న సెన్సెక్స్, నిఫ్టీ..

కొత్త రికార్డులతో మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్‌ను ఆరంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ప్రభావంతో దేశీయ సూచీలు లాభాల బాటపట్టాయి. సెన్సెక్స్‌ 100 పాయింట్లకు పైగా లాభంతో మొదలవగా.. నిఫ్టీ కూడా 10,5

ముంబై: కొత్త రికార్డులతో మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్‌ను ఆరంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ప్రభావంతో దేశీయ సూచీలు లాభాల బాటపట్టాయి. సెన్సెక్స్‌ 100 పాయింట్లకు పైగా లాభంతో మొదలవగా.. నిఫ్టీ కూడా 10,500 మార్క్‌కు చేరువలో కొనసాగుతోంది.

సెన్సెక్స్‌ 109 పాయింట్ల లాభంతో 33,840 వద్ద, నిఫ్టీ 24 పాయింట్ల లాభంతో 10,476 వద్ద ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.64.65గా కొనసాగుతోంది.

Sensex, Nifty, Midcap see profit booking; IT stocks outperform

టీసీఎస్‌, వేదంత, అరబిందో ఫార్మా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా.. యస్‌ బ్యాంక్‌, హిందుస్థాన్‌ పెట్రోల్‌, బీపీసీఎల్, కోల్ ఇండియా, విప్రో, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

ముడి చమురు ధరలు రెండున్నరేళ్ల గరిష్ఠానికిచేరడం చమురు కంపెనీలకు కలిసొచ్చింది. ఓఎన్‌జీసీ, గెయిల్‌ ఇండియా షేర్లు లాభపడ్డాయి. ఓఎన్‌జీసీ షేర్లు 2 శాతానికి పైగా పెరిగాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ఫ్యూచర్స్‌ బ్యారెల్‌ 64 డాలర్లకు ఎగిసింది.

బయోకాన్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, టాటా కెమికల్స్‌ కూడా 1-4 శాతం మధ్యలో లాభపడుతున్నాయి. పీఎస్‌యూ కంపెనీలు ఎంఎంటీసీ, ఎస్‌టీసీలు విలీనమవుతున్న వార్తల నేపథ్యంలో ఎంఎంటీసీ 17 శాతం, ఎస్‌టీసీ 8 శాతం ర్యాలీ జరుపుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+