వ్యాక్సిన్ల కొరత తీరేలా కీలక అడుగు -భారత్‌లో Sputnik V తయారీకి సీరం సంస్థకు DCGI అనుమతి

దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలై మూడు నెలలు దాటినా ఇప్పటి వరకు కేవలం 24 కోట్లమందికి మాత్రమే, అంటే దేశ జనాభాలో కనీసం 3శాతానికి మాత్రమే టీకాలు అందడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తికాకుంటే కొవిడ్ మూడో వేవ్ తప్పదన్న హెచ్చరికల నేపథ్యంలో టీకాల ఉత్పత్తిని పెంచేదిశగా కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది..

ప్రపంచంలోనే అతిపెద్ద టీకా ఉత్పత్తిదారు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఇప్పటికే తయారు చేస్తోన్న కొవిషీల్డ్(ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్) టీకాలకు అదనంగా రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి కరోనా వ్యాక్సిన్‌ ను కూడా ఉత్పత్తి చేస్తామంటూ దరఖాస్తు చేసుకోగా, దానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) నుంచి అనుమతి లభించింది. స్పుత్నిక్‌-వి ప్రయోగ ఫలితాల విశ్లేషణకు కూడా సీరం సంస్థకు అనుమతి లభించడం గమనార్హం.

Serum Institute gets DCGI’s nod to manufacture Sputnik V Covid vaccine in India

ఓవైపు కొవిషీల్డ్ ఉత్పత్తిని జూన్ నెలలో 10 కోట్ల డోసులకు పెంచుతూనే, మరోవైపు స్పుత్నిక్ వి టీకాలను కూడా తయారు చేస్తామంటూ సీరం సంస్థ గురువారం నాడు డీసీజీఐకి దరఖాస్తు చేసుకోగా, 24 గంటల్లోనే అనుమతులు లభించడం గమనార్హం. నిజానికి రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్టిమెంట్‌ ఫండ్‌(ఆర్‌డీఐఎఫ్‌) సహకారంతో గమలేయా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌కు భారత్ లో భాగస్వామిగా డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబరేటరీ కొనసాగుతుండగా, వ్యక్సిన్ల కొరత నేపథ్యంలో ఇప్పుడు సీరంలోనూ ఉత్పత్తి మొదలుకానుంది..

Serum Institute gets DCGI’s nod to manufacture Sputnik V Covid vaccine in India

స్ఫుత్నిక్ వినియోగానికి ఏప్రిల్‌లోనే డీసీజీఐ అనుమతి ఇవ్వగా, జులై నుంచి ఆ టీకా భారత్‌లోనే తయారు కానుంది. అప్పటివరకు రష్యాలో తయారైన డోసుల్ని దిగుమతి చేస్తున్నారు. తొలి దశలో 1.5లక్షల డోసులు, రెండో విడతలో 60వేల డోసులు, తాజాగా అతిపెద్ద కంటైన్మెంట్ 30లక్షల డోసులు రష్యా నుంచి హైదరాబాద్‌ చేరుకున్నాయి. కాగా, పుణెలోని హర్దాస్ పూర్ యూనిట్ లోనే స్పుత్నిక్ వి టీకాలను ఉత్పత్తి చేస్తామని సీరం ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+