స్టాలిన్ ఓటమిపై తేల్చేసిన మద్రాస్ హైకోర్టు..! కీలక తీర్పు..!
తమిళనాడులో గత ఎన్నికల్లో డీఎంకేతో పాటు పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ (MK Stalin) కూడా ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచీ ఆయనకు ఏదీ కలిసి రావడం లేదు. గత ఎన్నికల్లో అంతకు ముందు వరుసగా గెలుస్తున్న కొలత్తూరు స్ధానం సేఫ్ అని భావించి మరోసారి బరిలోకి దిగిన స్టాలిన్ కు టీవీకే అభ్యర్ది వీఎస్ బాబు షాకిచ్చారు. స్టాలిన్ ను దాదాపు 9 వేల మెజార్టీతో ఓడించారు. దీంతో షాకైన స్టాలిన్.. అప్పటి నుంచి దీనిపై మౌనంగానే ఉన్నారు. అయితే తాజాగా ఈ ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.
కొలత్తూరు ఎన్నికల్లో ఓటమిపాలైన స్టాలిన్.. అనంతరం 'అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా' కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించిన విధానం ప్రకారం.. ఆ నియోజకవర్గంలోని మొత్తం 286 ఈవీఎంలలో 5 శాతానికి సమానమైన 14 ఈవీఎం సెట్లు పరిశీలించాలని కోరారు. ఎన్నికల ఫలితాలు 2026 మే 4న వెలువడగా, సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువులోపే మే 7న స్టాలిన్ ఈ పరిశీలన కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే పరిశీలన ప్రక్రియ జూలై 29న ప్రారంభమైంది. చివరకు కొలత్తూరులోని ఈవీఎంలలో అక్రమాలు జరిగాయంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈసీ అభ్యంతరం తెలిపింది.

ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద దాఖలు చేసే ఎన్నికల పిటిషన్ ద్వారా తప్ప, మరే ఇతర మార్గంలోనూ ఎన్నికలను సవాలు చేసే అంశాలను కోర్టులు విచారించకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 329(బీ) నిరోధిస్తుందని ఈసీ వాదించింది. స్టాలిన్ రిట్ పిటిషన్ ద్వారా ఎన్నికల ఫలితాలను సవాల్ చేస్తున్నారని ఆరోపించింది. కొలత్తూరు నుండి టీవీకే అభ్యర్ధి వీఎస్ బాబు ఎన్నిక చెల్లదని, తాను ఎన్నికైనట్లు ప్రకటించాలన్న స్టాలిన్ వినతిని తోసిపుచ్చింది. కానీ మే నెలలో స్టాలిన్ కోరిన ఈవీఎం ధృవీకరణ ప్రక్రియను ఈసీ చేపట్టక ముందే, ఎన్నికల పిటిషన్ దాఖలు చేయడానికి గడువు ముగిసిపోయిందని ఆయన లాయర్ కపిల్ సిబల్ తెలిపారు.
ఈ వాదనతో ఏకీభవించని మద్రాస్ హైకోర్టు ధర్మాసనం.. స్టాలిన్ పిటిషన్ ను తోసిపుచ్చింది.














Click it and Unblock the Notifications