తమిళనాడు: రోడ్డు ప్రమాదంలో ఏడుగురి మృతి
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో ఇవాళ తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. మృతులంతా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారుగా గుర్తించారు.
తమిళనాడు రాష్ట్రంలోని తుతూకూడి సమీపంలోని కోవిల్‌పట్టు వద్ద కాలువలో వ్యాన్ పడిపోయింది.ఈ ఘటనలో వ్యాన్‌లో ప్రయాణీస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

మృతులంతా మధ్యప్రదేశ్ వాసులుగా గుర్తించారు.కన్యాకుమారికి వ్యానులో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది. గాయపడిన ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో ఇద్దరు మహిళలు కూడ ఉన్నారు.












Click it and Unblock the Notifications