Viral Video: క్షణాల్లో బీభత్సం సృష్టించిన కారు.. ఏడుగురికి తీవ్ర గాయాలు.. వీడియో వైరల్..
రోడ్డుపై వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనమే కాదు ఎదుటి వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే ప్రాణాలకు ప్రమాదమే. అయితే రోడ్డుపై చాలా మంది నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తుంటారు. కొందరైతే తప్ప తాగి కూడా డ్రైవింగ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల వారికే కాదు ఎదుటివారికి కూడా ప్రమాదమే. తాజాగా రోడ్డు ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆటోలను ఢీకొట్టుకుంటూ
ఈ వీడియోలో బిజీగా ఉన్న రోడ్డు పక్కన రోడ్డు ఆటోలు ఆగి ఉన్నాయి. అక్కడ చాలా మంది పాదచారులు రోడ్డు దాటుతున్నారు. అయితే ఇంతలో ఓ కారు వేగంగా వచ్చింది. ఆటోలను ఢీకొట్టుకుంటూ వచ్చి పాదచారులను కూడా ఢీకొట్టింది. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ముంబైలోని ఘట్కొపర్ లో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఏడుగురికి గాయాలయ్యాయి.
హరీష్ దేశ్ ముఖ్
ఈ వీడియోను హరీష్ దేశ్ ముఖ్ అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. పోస్ట్ తో పాటు నిన్న మధ్యాహ్నం ఘట్‌కోపర్ వద్ద ప్రమాదవశాత్తూ స్టార్ట్ అయిన క్యాబ్ అదుపు తప్పి ఏడుగురిని ఢీకొట్టింది. ఇందుకు సంబంధించిన CCTV ఫుటేజీ ఇది అని రాసుకొచ్చారు. ఈ వీడియో గురువారం పోస్ట్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్ అయింది.

క్యాబ్ డ్రైవర్
ఈ వీడియో చూసిన నెటిజన్లు క్యాబ్ డ్రైవర్ వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. అనసరంగా చాలా మందికి గాయాలయ్యాయని విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్యాబ్ డ్రైవర్ అదుపులోకి తీసుకున్నాడు. అతను మద్యం తాగి ఉన్నాడ.. లేక బ్రేకులు ఫెలయ్యయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications