సందడి మొదలైంది.. పోటెత్తిన కార్యకర్తలు.. పన్నీర్ ఇంట 'కళ'
రాత్రి-పగలు తేడా లేకుండా కార్యకర్తలంతా ఇంటికి క్యూ కట్టడంతో పోలీసులు సైతం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మీడియా పాయింట్ కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు.
చెన్నై: శశికళ-పన్నీర్ నడుమ కొనసాగుతున్న ఉత్కంఠ రాజకీయాలకు ఇంకా తెరపడట్లేదు. గవర్నర్ వేచి చూసే ధోరణితో.. ఇద్దరిలో పైచేయి ఎవరిదో తేలడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోగా ఎవరి రాజకీయ శిబిరాలను వారు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ముఖ్యంగా అన్ని వర్గాల నుంచి అనూహ్య మద్దతు సంపాదించుకున్న పన్నీర్ చెంతకు ఎమ్మెల్యేలు జారిపోకుండా ఉండటానికి అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ ఎమ్మెల్యేల పట్ల జాగ్రత్తపడుతున్నారు. అదే సమయంలో పన్నీర్ కు అంతకంతకు మద్దతు పెరిగిపోతుందన్న వార్తలు ఆమె శిబిరంలో కలకలం రేపుతున్నాయి.

ఈ పరిణామాలకు మరింత ఊతమిచ్చేలా పన్నీర్ ఇంటి వద్ద అన్నాడీఎంకె కార్యకర్తల కోలాహలం మొదలైంది. రాత్రి-పగలు తేడా లేకుండా కార్యకర్తలంతా ఇంటికి క్యూ కట్టడంతో పోలీసులు సైతం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మీడియా పాయింట్ కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు.
భారీ ఎత్తున కార్యకర్తలు తరలివస్తుండటంతో.. వారందరిని ప్రవేశద్వారం వద్దనే మెటల్ డిటెక్టర్‌తో క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఆ తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. ఇంటి ప్రాంగణంలో రెండు మూడు ఎల్ఈడీ తెరలను సైతం ఏర్పాటు చేశారంటే.. రద్దీ ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications