దేవేంద్ర ఫడ్నవిస్ విడాకులు ఇస్తాడేమో- బుకీతో భార్య ఛాటింగ్: వెలుగులోకి సంచలన విషయాలు

ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృత ఫడ్నవిస్‌ను ఓ బుకీ లంచం కోసం డిమాండ్ చేసిన కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తోన్నాయి. ఈ కేసులో ముంబై పోలీసులు 793 పేజీల డాక్యుమెంట్‌‌ను తయారు చేశారు. ఈ కేసును విచారిస్తోన్న ప్రత్యేక న్యాయస్థానానికి అందజేశారు. బుకీ పేరు- అనిల్ జైసింఘాని. ఆయన కుమార్తె, అనిక్ష జైసింఘాని, సమీప బంధువు నిర్మల్‌‌ పేర్లను ఇందులో పొందుపరిచారు.

అమృతా ఫడ్నవీస్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులను వసూలు చేయడానికి ప్రయత్నించిన కేసులో ఈ ముగ్గురి పేర్లను ప్రధాన నిందితులుగా చేర్చారు. అమృత ఫడ్నవీస్- అనిల్ జైసింఘానీ మధ్య అనేక టెలిఫోనిక్ చాట్‌ల వివరాలను న్యాయస్థానానికి అందజేశారు. వాట్సాప్ ఛాటింగ్, మెసేజీల స్క్రీన్‌షాట్లు సైతం ఈ డాక్యుమెంట్‌లో ఉన్నాయి.

cmdevendrafadnavis

తన కుమార్తె అనిక్ష జైసింఘాని నుంచి వ్యక్తిగతంగా సహాయం పొందిన విషయంలో అమృత ఫడ్నవిస్‌ను అనిల్ జైసింఘాని బెదిరించారు. ఆమె నుంచి పెద్ద ఎత్తున లంచాన్ని డిమాండ్ చేశారు. తన కుమార్తెతో జరిపిన సంభాషణ ఆడియో, వీడియో క్లిప్పింగ్ వెలుగులోకి రాకుండా ఉండటాలంటే తనకు లంచం ఇవ్వాలంటూ బెదిరించాడు. ఈ కేసులో ఆయనపై ఫిబ్రవరి 20వ తేదీన దక్షిణ ముంబైలోని మలబార్ హిల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

తాజాగా న్యాయస్థానానికి సమర్పించిన డాక్యుమెంట్లల్లో- వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలను రికార్డ్ చేశారు. అనిక్ష జైసింఘాని చేసిన డిమాండ్లకు తాను లొంగదలచుకోలేదని, తాను ఏ తప్పూ చేయలేదని అమృత ఫడ్నవిస్ స్పష్టం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆడియో, వీడియో క్లిప్పింగ్స్‌ను బయటపెట్టాలనుకోవడం అవివేకమౌతుందని, తనపై ఎలాంటి ప్రభావాన్ని చూపదని అమృత ఫడ్నవిస్ పేర్కొన్నారు.

2019 నుంచి దేవేంద్ర ఫడ్నవిస్‌తో మంచి సంబంధాలు ఉండట్లేదని, ఈ కేసు తరువాత ఆయన విడాకులు తీసుకోవచ్చని తాను భావిస్తున్నట్లు అమృత ఫడ్నవిస్ బుకీతో వివరించినట్లు పోలీసులు వెల్లడించారు. తనను తప్పుడు కేసుల్లో ఇరికించారని, న్యాయం చేయడంలో ఉప ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలంటూ అనిల్ జైసింఘాని కూడా అమృత ఫడ్నవిస్‌కు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+