హార్దిక్ పటేల్‌పై 'సెక్స్ క్లిప్'? ఆరోపణలు: అండగా దళిత నేత.. కేసు పెట్టి ఈడ్చమంటూ!

Subscribe to Oneindia Telugu

అహ్మదాబాద్: ఎన్నికలవేళ గుజరాత్‌లో పలు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ సెక్స్ క్లిప్ ఒకటి మీడియాకు లీకవడం సంచలనం రేకెత్తిస్తోంది.

బీజేపీ నేతలకు ఈ సెక్స్ క్లిప్ ఆయుధంగా మారింది. కాంగ్రెస్ తో జతకట్టిన హార్దిక్ పటేల్ ను విమర్శించడానికి బీజేపీ దీన్నో అస్త్రంగా ఉపయోగించుకుంటోంది. మరోవైపు హార్దిక్ పటేల్ మాత్రం.. అందులో ఉన్నది తాను కాదని చెబుతున్నారు.

ఇలాంటి తరుణంలో గుజరాత్ కు చెందిన యువ దళిత నేత జిగ్నేశ్ మెవానీ హార్దిక్ పటేల్‌కు అండగా నిలిచారు. 'హార్దిక్ నీ వెంట నేనున్నా. శృంగారం అనేది ప్రాథమిక హక్కు. నీ ఏకాంతానికి భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదు' అంటూ ట్వీట్ చేశారు.

ఇదే అంశంపై మీడియాతోను జిగ్నేశ్ మాట్లాడారు. వీడియోలో ఉన్నది హార్దిక్ పటేలే అయినా తప్పు పట్టాల్సిన అవసరం లేదని, వీడియోను లీక్ చేసినవారిని కోర్టుకు ఈడ్చాల్సిన అవసరముందని అన్నాడు.

హార్దిక్ పటేల్ మాత్రం.. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో తనపై బురద జల్లేందుకే బీజేపీ ఇలాంటి కుట్రలు పన్నుతోందని అంటున్నాడు. కాగా, జిగ్నేశ్ గుజరాత్ లో దళిత హక్కుల కోసం పోరాడుతున్నారు. ఉన్నావ్ లో దళితులపై దాడి తర్వాత ఆయన పెద్ద ఎత్తున పోరాటం చేశారు.

ఇదిలా ఉంటే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే.. పటేళ్లకు రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామికి హార్దిక్ పటేల్ అంగీకారం తెలిపారు. తమ సామాజిక వర్గంలోని ఇతర నేతలతోను దీనిపై చర్చిస్తామన్నారు. రాజ్యాంగ పరిధిలోనే రిజర్వేషన్లను సాధించాలనేది తమ లక్ష్యం అన్నారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఫార్ములా బాటలో నడిస్తే ఇతర సామాజిక వర్గాలకూ ప్రయోజం చేకూరుతుందన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Hardik Patel has nothing to be ashamed of, said young Gujarat politician Jignesh Mevani as he tweeted, "Right to sex is a fundamental right. No one has right to breach your privacy."

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి