సెక్స్‌రాకెట్‌: ఇంజినీరింగ్, మెడికల్ విద్యార్థుల అరెస్ట్

అగర్తాలా: పలు రెస్టారెంట్లలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న సెక్స్ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. ఈ ఘటన త్రిపుర రాజధాని అగర్తాలాలో చోటు చేసుకుంది.

హోటళ్లలో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఆదివారం రాత్రి మూడు రెస్టారెంట్లపై పోలీసులు దాడులు నిర్వహించి ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. రెస్టారెంట్ యజమానులు, 13 మంది మహిళలతో పాటు మొత్తం 34 మందిని అదుపులోకి తీసుకున్నారు.

sex racket

వీరిలో నగర సమీపంలోని ప్రముఖ ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలలకు చెందిన 20మంది విద్యార్థినులు, ఇద్దరు మైనర్లు, యువతులు ఉన్నట్టు సోమవారం పోలీసులు తెలిపారు.

వ్యభిచారం నిర్వహిస్తున్న మూడు రెస్టారెంట్ల యజమానులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారిని ఆదివారం రాత్రి స్థానిక కోర్టు ముందు హాజరుపర్చినట్లు చెప్పారు. నగరంలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెస్ట్ త్రిపుర జిల్లా పోలీస్ అధిపతి బిజోయ్ నాగ్ హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+