వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బలవంతపు సెక్సే కానీ రేప్ కాదు: హైకోర్టు సంచలనం

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అత్యాచారం విషయంలో ఢిల్లీ హైకోర్టు సంచలనాత్మక తీర్పును వెలువరించింది. ఒకప్పుడు తాను తల్లిగా పిలిచే 60 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసి, ఆమెను హతమార్చిన కేసులో నిందితుడికి పడిన జీవిత ఖైదను పక్కన పెట్టేసింది. ఈ మేరకు జస్టిస్ ప్రదీప్ నందరాజోగ్, జస్టిస్ ముక్తా గుప్తాలతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించింది.

బాగా తాగిన సమయంలో అచ్చేలాల్ అనే వ్యక్తి ఆ మహిళపై అత్యాచారం చేశాడు. దాంతో ఆమె మరణించింది. అతను ఆ హత్యను కావాలని చేయలేనది, అలాంటి ఉద్దేశం కూడా అతనికి లేదని, అందువల్ల అతడికి ఐపిసి సెక్షన్ 302 కింద శిక్ష విధించడం సరికాదని బెంచ్ అభిప్రాయపడింది. అత్యాచారానికి గురైన మహిళ వయస్సు 60 ఏళ్లకు పైగా ఉందని, ఆమె మోనోపాజ్ దశను దాటడంతో ఆ చర్యను శిక్షార్హంగా భావించలేమని తేల్చింది. శృంగారంలో పాల్గొనడానికి ముందు ఆ మహిళ కూడా మద్య సేవించి ఉన్నట్లు పోస్టుమార్టంలో నివేదికలో తేలింది.

Sex was 'forceful' but not rape: Delhi Court's controversial verdict

ఆ విధమైన బలవంతపు లైంగిక చర్య వల్ల మహిళ మరణిస్తుందనే తెలివి గానీ, అలా చంపాలనే ఉద్దేశం గానీ నిందితుడికి లేదని కోర్టు అభిప్రాయపడింది. అత్యాచారం అభియోగాలనుంచి కూడా కోర్టు అతన్ని విముక్తం చేసింది. మోనోపాజ్ దాటి ఉన్నందు వల్ల అత్యాచారం కింద అభియోగాలను పరిగణనలోకి తీసుకోలేమని చెప్పింది.

లైంగిక క్రీడ బలవంతంగా జరిగినప్పటికీ అది మృతురాలి కోరికకు లేదా ఆమె అంగీకారానికి భిన్నంగా శృంగారానికి పూనుకున్నాడని చెప్పడానికి వీలు లేదని కోర్టు చెప్పింది. అందువల్ల అత్యాచారం అభియోగాల నుంచి కూడా అతనికి విముక్తి కలిగించినట్లు తెలిపింది.

ఈ కేసులో అచ్చే లాల్‌కు ట్రయల్ కోర్టు 2011లో జీవిత ఖైదుతో పాటు 10 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. పలువురి ఇళ్లలో పని మనిషిగా కుదురుకున్న ఉత్తర ఢిల్లీలోని మంజుకా తిలా ప్రాంతానికి చెందిన ఆ మహిళ 2010 డిసెంబర్‌లో తన ఇంట్లో మరణించింది. ఆమె మృతదేహం పక్కన ఖాళీ విస్కీ బాటిల్ పడి ఉంది.

English summary
The Delhi High Court set aside the life imprisonment awarded to a man for raping and killing a 60-year-old woman "whom he used to call his mother".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X