‘ఈ పాత నోట్లు ఎలా మార్చుకోమంటారు’? మోడీ, సుష్మాలకు ట్వీట్ చేసిన మహిళ!

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ప‌్ర‌ధాని న‌రేంద్ర మోడీకి ఓ సెక్స్ వ‌ర్క‌ర్ ట్వీట్ చేసింది. త‌న ద‌గ్గ‌ర రూ.ప‌ది వేల వ‌ర‌కు పాత నోట్లు ఉన్నాయ‌ని, వాటిని ఎలా మార్చుకోవాలో చెప్పాలంటూ ఆమె కోరింది. ప్ర‌ధాని మోదీతోపాటు విదేశాంగ మంత్రి సుష్మా స్వ‌రాజ్‌కు కూడా ఆమె ట్వీట్ చేసింది.

తాను ఎలా సెక్స్ వ‌ర్క‌ర్ గా మారింది, ఆ డ‌బ్బు తన చేతికెలా వ‌చ్చింది అనే విష‌యాల‌న్నీ ఓ పేప‌ర్‌పై రాసి దానిని వారికి ట్వీట్ చేసింది. బంగ్లాదేశ్‌కు చెందిన ఆ మహిళ‌ను ఉద్యోగం ఇప్పిస్తామంటూ మాయ‌మాట‌లు చెప్పి ఇండియాకు ర‌ప్పించిన కొంద‌రు.. వేశ్య‌గా మార్చేయగా 2015 డిసెంబ‌ర్‌లో పుణెలోని ఓ వేశ్యాగృహం నుంచి ఆమెను ఓ రెస్క్యూ ఫౌండేష‌న్ కాపాడిందట.

Sex worker seeks PM Narendra Modi's help to change Rs 10,000 old currency

అయితే నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో తనకు చెందిన పాత నోట్లు పుణేలోని వేశ్యాగృహం నిర్వాహ‌కుల ద‌గ్గ‌ర ఉండిపోయాయని, ఈ కారణంగా తాను వాటిని మార్చుకోలేక‌పోయాన‌ని ఆమె ప్రధానికి వివరించింది. ఇప్పుడు వాటిని మార్చుకోవ‌డానికి సాయం చేయాల‌ని ఆ ట్వీట్‌లో కోరింది.

బంగ్లాదేశ్‌లోని ఓ బ‌ట్ట‌ల షాపులో ప‌నిచేసే త‌న‌ను ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 2013లో త‌నతోపాటు ప‌నిచేసే వ్య‌క్తి ఇండియాకు తీసుకొచ్చాడ‌ని, అత‌ను వ‌శి అనే వ్య‌క్తికి త‌న‌ను అప్ప‌గించ‌గా.. ఓ నేపాలీ మ‌హిళ‌కు రూ.50 వేల‌కు తనను వశి అమ్మేశాడ‌ని వెల్ల‌డించింది.

Sex worker seeks PM Narendra Modi's help to change Rs 10,000 old currency

అక్క‌డి నుంచి బెంగ‌ళూరుకు, ఆ త‌ర్వాత పుణేకు త‌ర‌లించ‌గా.. అక్క‌డే త‌న‌ను వేశ్య‌గా మార్చేశార‌ని ఆ మ‌హిళ పేర్కొంది. ఏడాదిన్న‌ర త‌ర్వాత 2015, డిసెంబ‌ర్‌లో ఓ రెస్క్యూ ఫౌండేష‌న్ ఆమెకు కాపాడింది.

ఆ స‌మ‌యంలో తాను సంపాదించుకున్న రూ.ప‌ది వేలు ఈ మ‌ధ్యే త‌న చేతికి అందాయని, అయితే అవ‌న్నీ పాత నోట్లు కావ‌డంతో ఇప్పుడు వాటిని ఎలా మార్చుకోవాలో అర్థం కావడం లేదని, మార్చుకునే అవ‌కాశం ఇవ్వాల‌ని ఆమె ఏకంగా ప్ర‌ధాని మోడీకే ట్వీట్ చేసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
When she was rescued from the brothel in Budhwarpeth, Pune, in December 2015, she had bigger battles to fight. This Bangladeshi national, who had been lured to India under the false pretext of a job, and was instead sold into commercial sex work, had to first find her way home. But now that clearance from her home country to accept her back has come through, she has tweeted a hand-written letter to the Prime Minister to help her convert the Rs 10,000 she had saved in the old denominations to new ones.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి