సినినటి జయప్రదపై లైంగిక వేధింపులు
సినినటి, బిజేపి నేత జయప్రదపై లైంగిక వేధింపులకు పాల్పడ్డని ఆరోపిస్తూ ఉత్తర ప్రదేశ్ లోని సంబల్ జిల్లా సమాజ్ వాది పార్టీ ఇంచార్జ్ ఫిరోజ్ ఖాన్ పై కేసు నమోదు అయింది.

ఎన్నికల్లో భాగంగా నటి జయప్రద ఇటివల బీజేపీలో చేరిన విషయం తెలిసిందే, ఆమే ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ లోక్ సభ నియోజక వర్గం నుండి పోటి చేయనుంది.ఈ నేపథ్యంలోనే యూపి కి చెందిన సంబల్ జిల్లా సమాజ్ వాది పార్టీ ఇంచార్జ్ ఫిరోజ్ ఖాన్ ఆమేపై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అందులో జయప్రద చేరికతో రానున్న ''రానున్న ఎన్నికల్లో రాంపూర్ నియోజకవర్గం సాయంత్రాలు కలర్ ఫుల్ కానున్నాయంటు'' నవ్వుతూ వ్యాఖ్యానించారు దీంతో ఆమేను ఆవమానిస్తూ మాట్లాడారని ఆరోపణలు చుట్టుముట్టాయి.ఈనేపథ్యంలోనే ఆయనపై కేసు నమోదు అయినట్టు జిల్లా ఎస్పి జమునా ప్రసాద్ తెలిపారు,
కాగా దీనిపై స్పందించి ఫిరోజ్ ఖాన్ తాను ఆ ఉద్దేశ్యంతో మాట్లాడలేదని,జయప్రద అంటే తాను కూడ అభిమానిస్తానని అన్నారు.ఈనేపధ్యంలో ఏస్పి నేత అఖిలేష్ యాదవ్ స్త్రీలను గౌరవించాలని, పార్టీ నేతలకు పిలుపునిచ్చారు












Click it and Unblock the Notifications