విద్యార్థినికి మద్యం తాగించి గ్యాంగ్ రేప్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో రోజు రోజుకు ఘోరాలు ఎక్కువ అవుతున్నాయి. తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని కిడ్నాప్ చేసిన దుండగులు గ్యాంగ్ రేప్ చేసి తప్పించుకున్నారు. పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.
ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శనివారం తొమ్మిదో తరగతి చదువుతున్న 15 సంవత్సరాల విద్యార్థిని స్కూల్ నుంచి ఇంటికి బయలుదేరింది. అదే సమయంలో ఒక వాహనంలో వచ్చిన ముగ్గురు బాలికను నజఫ్గర్ ప్రాంతంలో అడ్డగించారు.
తరువాత బాలికను కిడ్నాప్ చేసి తీసుకు వెళ్లారు. అనంతరం బాలికకు బలవంతంగా మద్యం తాగించారు. 10 గంటల పాటు బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం బాలికను తీసుకు వెళ్లి ఆమె ఇంటి ముందు పారేసి వెళ్లిపోయారు.

సామూహిక అత్యాచారం చేసే సమయంలో వారు సెల్ ఫోన్ లో చిత్రీకరించారని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆ క్లిప్పింగ్స్ ఫేస్ బుక్ లో పెడతామని నిందితులు బెదిరించారని బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ఇప్పటి వరకు ఎవరిని అరెస్టు చెయ్యలేదు.
తాను ఫిర్యాదు చేసినా నిందితులను అరెస్టు చెయ్యకపోవడంతో పోలీసులు వారితో సంబంధాలు పెట్టుకున్నారని అనుమానం వస్తున్నదని బాలిక ఆరోపిస్తున్నది. అయితే నిందితుల కోసం తాము గాలిస్తున్నామని, బాలికను వైద్య పరిక్షలకు తరలించామని పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications