షాహిద్ అఫ్రీదికి షాకిచ్చిన భారత్!
జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాంలో 26 మంది పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి ప్రాణాలు తీసిన విషయం విదితమే. ఆ మారణకాండ జరిగిన నాటి నుంచి భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పహల్గాం ఉగ్రదాడిలో పాక్ హస్తం ఉందని తేలడంతో ఆ దేశంపై భారత్ తీవ్రమైన చర్యలకు ఉపక్రమించింది.
సింధూ నది జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. దీంతో 80 శాతం పాకిస్థాన్ సాగు, తాగు నీటి సమస్యకు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు, పాక్ వీసాలను రద్దు చేసింది. దేశంలోని పాకిస్థాన్ పౌరులు వెంటనే వెళ్లిపోవాలని ఆదేశించింది. తాజాగా, పాక్ విమానాలకు భారత గగన తలాన్ని మూసివేసి మరో షాకిచ్చింది. ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య మాటల యుద్ధం కూడా జరుగుతోంది. పాకిస్థాన్‌లోని మంత్రులు, కొందరు ప్రముఖులు భారత్‌పై పిచ్చికూతలు కూస్తున్నారు. భారత్ నుంచి వారిగి గట్టిగానే బదులిస్తున్నారు మనవాళ్లు.

కాగా, పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రీది మరోసారి తన నోటి దురుసును బయటపెట్టుకున్నాడు. భారత సైన్యం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్ సమా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అఫ్రీది మాట్లాడుతూ.. భారత్‌కు కాశ్మీర్‌లో 8 లక్షల మంది సైనికులు ఉన్నారు. అయినప్పటికీ.. ఉగ్రదాడి జరిగిందా? అంటే మీరు పనికిరాని వారు, మీ ప్రజలకు భద్రత కల్పించలేకపోయారు అంటూ వ్యాఖ్యానించాడు.
అంతేగాకుండా, జమ్మూకాశ్మీర్‌లో పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థల్ని సమర్థించే ప్రయత్నం చేశాడు. మరోవైపు భారతదేశంలో అనేక ఉగ్రవాద దాడులకు కారణమైన నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా కథనాన్ని అఫ్రీది తన యూట్యూబ్ ఛానల్‌లో ప్రసారం చేశాడు. అఫ్రీది బంధువులు కూడా ఉగ్రవాద సంస్థల్లో పనిచేస్తుండటం గమనార్హం. భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో అఫ్రీది యూట్యూబ్ ఛానల్‍పై భారత్‌లోనిషేధం విధించినట్లు తెలుస్తోంది.
అయితే, హోంమంత్రిత్వ శాఖ నుచి అధికారిక మాత్రం రాలేదు. కానీ, భారత్‌లో అఫ్రీది యూట్యూబ్ ఛానల్ అందుబాటులో లేదు. ఛానల్ ను యాక్సెస్ చేసినప్పుడు కంటెంట్ అందుబాటులో లేదని సూచించే మెసేజ్ దర్శనిమిస్తోంది. పాక్ మాజీ క్రికెటర్లు షోయబ్ అక్తర్, బాసిత్ అలీల యూట్యూబ్ ఛానళ్లు కూడా భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో ఇప్పటికే నిషేధం విధించారు.












Click it and Unblock the Notifications