ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో రెండోసారి సిట్ దర్యాప్తుకు హాజరు కాని షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దడ్లానీ
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ముంబై క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ తీసుకుంటూ అక్టోబర్ 2న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆర్యన్ ఖాన్ కు ఉచ్చు బిగించే యత్నం చేసింది. ఈ క్రమంలో స్పెషల్ కోర్టు రెండుసార్లు ఆర్యన్ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించగా బాంబే హైకోర్టు ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరు చెయ్యటంతో ఊరటనిచ్చింది. ఆ తర్వాత గత శుక్రవారం ఆర్యన్ ఖాన్ ఎన్సీబీ విచారణకు హాజరయ్యాడు .
రెండో సారి సమన్లకు పూజా దడ్లానీ నో రెస్పాన్స్ .. విచారణకు డుమ్మా
ఇక ఈ కేసులో షారూక్ ఖాన్ మేనేజర్ పూజా దడ్లానీ కూడా ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటిసారి పూజా దడ్లానీకి సమన్లు జారీ చెయ్యగా అనారోగ్యం కారణంగా విచారణకు హాజరు కాలేనని, కొంత సమయం ఇవ్వాలంటూ పూజ దడ్లానీ ముంబై పోలీసులను కోరి విచారణకు హాజరు కాలేదు. ఇప్పుడు మరోమారు ఆమెకు సమన్లు జారీ చేశారు ముంబై పోలీసులు. ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో విచారణ నిమిత్తం ముంబై పోలీసులు రెండోసారి సమన్లు పంపిన తర్వాత కూడా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖాన్ మేనేజర్ పూజా దడ్లానీ విచారణకు హాజరు కావడానికి మరింత సమయం కోరినట్లు పోలీసులు తెలిపారు.

మూడోసారి సమన్లు జారీ చేసే అవకాశం ఉందన్న సిట్
ఇప్పుడు మూడోసారి మళ్ళీ సమన్లు జారీ చేసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఇప్పటివరకు 20 మంది తమ వాంగ్మూలాలను నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ముంబై క్రూయిజ్ కేసులో డ్రగ్స్‌పై విచారణ కోసం ముంబై పోలీసుల సమన్లను ఆరోగ్య కారణాలను చూపుతూ పూజా దద్లానీ బుధవారం దాటవేశారు. క్రూయిజ్ డ్రగ్స్ కేసులో పూజా దడ్లానీపై ఆర్యన్ ఖాన్ ను తప్పించడం కోసం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు లంచం ఇవ్వడానికి ప్రయత్నం చేశారని వచ్చిన ఆరోపణలపై ముంబై పోలీసుల సిట్ బృందం దర్యాప్తు చేస్తోంది.
Recommended Video
ఆర్యన్ ఖాన్ ను కేసు నుండి తప్పించటానికి లంచం డీల్ చేసిన పూజా దడ్లానీ
పూజా దడ్లానీ, కేపీ గోసావి, సామ్ డిసౌజా లు ఆర్యన్ ఖాన్ ను డ్రగ్స్ కేసు నుండి తప్పించడం కోసం 25 కోట్ల రూపాయల డీల్ చేసుకున్నారని, కేపీ గోసావి బాడీగార్డ్ ప్రభాకర్ సెయిల్ అఫిడవిట్ ఇవ్వడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో లంచం ఆరోపణలు ఎదుర్కొన్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఉన్నతాధికారి సమీర్ వాంఖడే పై, లంచం వ్యవహారంపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఇక ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విచారణ నుండి తప్పించింది. ఇక నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విజిలెన్స్ టీమ్ కూడా ఆమెకు సమన్లు పంపే అవకాశం ఉందని సమాచారం.
ఆర్యన్ ఖాన్ కేసు.. లంచం డీల్ పై సామ్ డిసౌజా చెప్పింది ఇదే
ఈ కేసులో సామ్ డిసౌజా సంచలన విషయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే. తాను అక్టోబర్ 3 తెల్లవారుజామున పూజా దడ్లానీ మరియు గోసావి మధ్య ఒక ఒప్పందానికి మధ్యవర్తిత్వం చేయడానికి సమావేశాన్ని ఏర్పాటు చేశానని , పూజా దడ్లానీ, ఆమె భర్త, గోసావి, తాను మరికొందరు అక్టోబర్ 3 వ తేదీన ఉదయం 4 గంటలకు లోయర్ పరేల్‌లో కలుసుకున్నామని చెప్పాడు. ఆర్యన్ ఖాన్ ను కేసు నుండి తప్పించడం కోసం గోసావి దడ్లానీ నుండి రూ. 50 లక్షలు తీసుకున్నాడని, అయితే గోసావి మోసం చేశాడని,గుర్తించి అతని వద్ద నుండి తిరిగి డబ్బులు ఇప్పించానని సామ్ డిసౌజా వెల్లడించారు.












Click it and Unblock the Notifications