వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెలిఫోన్ ఆపరేటర్‌పై రేప్: జీవిత ఖైదు (ఫొటోలు)

By Pratap
|
Google Oneindia TeluguNews

ముంబై: ముంబై నడిబొడ్డున నిరుడు జులైలో జరిగిన సామూహిక అత్యాచారం కేసులో నలుగురికి కోర్టు జీవిత ఖైదు విధించింది. శక్తి మిల్స్ ఆవరణలో ఈ సామూహిక ఆత్యాచారం జరిగింది. శక్తి మిల్స్ ఆవరణలోనే ఓ మహిళా ఫొటోగ్రాఫర్‌పై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో వీరిలో ముగ్గురిని దోషులుగా నిర్ధారిస్తూ గురువారం తీర్పు వెలువరించింది.

ఈ కేసులో కూడా వారికి శుక్రవారంనాడే శిక్షను ఖరారు చేయాల్సి ఉండగా, సోమవారానికి వాయిదా వేసింది. ఫాస్ట్ ట్రాక్ కోర్డు గురువారంనాడు వారిని దోషులుగా నిర్ధారించింది. 2013 ఆగస్టు 22న ముంబైలోని శక్తి మిల్స్ పరిసరాల్లో మహిళా ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం జరిగింది. తన విధులలో భాగంగా మిల్స్ పరిసరాలకు వెళ్లిన 23ఏళ్ల మహిళా ఫొటో జర్నలిస్టుపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడరు.

అత్యాచారానికి పాల్పడే ముందు ఆమెకు బలవంతంగా పోర్న్ వీడియోలను చూపించారు. అంతేగాక తనతోపాటు వచ్చిన సహాయకుడిని చితకబాదారు. దీంతో తీవ్ర గాయాలైన అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఈ ఘటన ముంబైలో అప్పుడు సంచలనమైంది. దీంతో నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు.

చివరకు విజయ్ జాదవ్, కాసీమ్ బెంగాలీ, సిరాజ్ రెహమాన్, సలీమ్ అన్సారీ అనే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన విచారణలో పలు అంశాలను పరిశీలించిన కోర్టు, నిందితులందర్నీ దోషులుగా నిర్ధార్థిస్తూ తీర్పు వెలువరించింది. నిందితులకు వ్యతిరేకంగా ఫోరెన్సిక్ ఆధారాలు, కాల్ డేటా, రికార్డులు, డిఎన్ఏ రికార్డులు ఉన్నాయని విచారణలో పోలీసులకు కోర్టుకు తెలిపారు.

ముంబైలో..

ముంబైలో..

నిరుడు మహిళా ఫొటో జర్నలిస్టుపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలు నుంచి సెషన్స్ కోర్టుకు ఓ నిందితుడి తరలిస్తున్న దృశ్యం. ఈ కేసులో దోషులకు కోర్టు సోమవారం శిక్షను ఖరారు చేయనుంది.

ముంబైలో

ముంబైలో

మహిళా జర్నలిస్టుపై అత్యాచారం కేసులో నలుగురిని కోర్టు గురువారంనాడు దోషులుగా నిర్ధారించింది. వారికి సోమవారం శిక్షను ఖరారు చేయనుంది.

ముంబైలో...

ముంబైలో...

మహిళా ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం కేసులో మరో నిందితుడిని ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలు నుంచి గురువారంనాడు కోర్టుకు తరలిస్తున్న దృశ్యం.

ముంబైలో..

ముంబైలో..

మహిళా ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం కేసులో గురువారంనాడు ఓ నిందితుడిని ఆర్థర్ రోడ్డు జైలు నుంచి కోర్టుకు తరలిస్తున్న పోలీసులు...

ముంబైలో...

ముంబైలో...

మహిళా జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం కేసులో కోర్టు గురువారంనాడు నలుగురిని దోషులుగా నిర్ధారించారు. వారికి సోమవారం శిక్షను ఖరారు చేయనుంది.

ముంబైలో..

ముంబైలో..

మహిళా జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం కేసులో నలుగురిని కోర్టు దోషులుగా నిర్ధారించిన తర్వాత కోర్టు వెలుపల ఇలా విజయసంకేతంతో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికం

ముంబైలో..

ముంబైలో..

మహిళా జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం జరిగిన ముంబైలోని శక్తి మిల్స్ కాంపౌండ్ ఆవరణ ఫైల్ ఫొటో ఇది.. ఈ కేసులో నలుగురిని గురువారంనాడు దోషులుగా నిర్ధారించింది.

ముంబైలో..

ముంబైలో..

మహిళా జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం జరిగిన ముంబైలోని శక్తి మిల్స్ కాంపౌండ్ ఆవరణ ఫైల్ ఫొటో ఇది.. ఈ కేసులో నలుగురిని గురువారంనాడు దోషులుగా నిర్ధారించింది.

English summary
Four men have been given the life sentence for gang-raping a telephone operator in the heart of Mumbai in July last year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X