వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హవ్వా.. రూ.20 పెట్టి జెండా కొనాలా..? దుమారం, వరుణ్ గాంధీ నిప్పులు

|
Google Oneindia TeluguNews

స్వతంత్ర్య భారతవని 75వ స్వాతంత్య్ర వేడుకులు జరుపుకోబోతుంది. ఇందుకు యావత్ దేశం సిద్దమై ఉంది. వేడుకలకు సంబంధించి ప్రధాని మోడీ ఇప్పటికే తన సోషల్ మీడియా ఖాతాల్లో డీపీని తిరంగ జెండా పెట్టుకున్నారు. మిగతా వారు కూడా పెట్టుకోవాలని సూచించారు. ఇంకేముంది ఆయన అనుచరులు, అభిమానులు ఫాలొ అవుతున్నారు. చాలా మంది ఇళ్లపై కూడా ఉంచుతున్నారు. ఇది ఒక స్థాయి వరకు అయితే ఓకే.. కానీ అదీ దాటితేనే ప్రమాదం. అవును కొందరు రేషన్ షాపుల్లో విధిగా జెండా కొనాలని షరతు విధించిన వార్త దుమారం రేపింది. దీనిపై సొంత పార్టీ నేత, ఎంపీ వరుణ్ గాంధీ స్పందించారు.

పేదలకు భారం..

వరుణ్ గాంధీ బీజేపీ ఎంపీ అయినప్పటికీ.. స్వపక్షంలో విపక్షలంలా ఉన్నారు. అవును సొంత పార్టీ విధానాలను విమర్శిస్తారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ వీడియో షేర్ చేశారు. దేశం 75వ ఇండిపెండెన్స్ డే వేడుకలు జరుపుకుంటున్న వేళ పేదలకు భారంగా మారిందని అన్నారు. రేషన్ షాపుల్లో బియ్యం తీసుకునేవారిని జెండా కొనమనడం ఏంటీ అని అడుగుతున్నారు.

జెండా కొనుగోలు చేయడం ఏంటీ..?

జెండా కొనుగోలు చేయడం ఏంటీ..?

జెండా కొనడం ఏంటీ.. ప్రతీ ఒక్కరీ మనస్సులో తిరంగ నిండి ఉంటుందని చెప్పారు. కానీ సరుకు కొనే సమయంలో తీసుకోవాలని అడగడం.. లేదంటే ఇవ్వమని చెప్పడం ఏంటీ అని అంటున్నారు. దీనిపై దుమారం కొనసాగుతుంది. పేదలను జెండా కొనుగోలు చేయడం కోరడం ఏంటీ అని అడుగుతున్నారు. ఇదీ సరికాదు అని అంతా అంటున్నారు.

రూ.20 పెట్టి జెండా

రూ.20 పెట్టి జెండా


ఇటు ఓ రేషన్ షాపు వద్ద రూ.20 పెట్టి జెండా కొనుగోలు చేయాలని కోరుతున్నారు. లేదంటే బియ్యం ఇవ్వాలని అనడం ఏంటీ అంటున్నారు. ఆ వీడియో వైరల్ అయ్యింది. ఇంకేముంది ఆ షాపు ఓనర్ లైసెన్స్ సస్పెండ్ చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తోన్న వారిపై చర్యలు ఉంటాయని డిప్యూటీ కమిషనర్ అనీష్ యాదవ్ తెలిపారు. రేషన్ షాపుల్లో జాతీయ జెండాలు ఉంటాయని.. వారికి కావాలంటే కొనుగోలు చేయొచ్చని.. బలవంతం చేయకూడదని అంటున్నారు.

English summary
Pilibhit MP varun gandhi shared video on Twitter with a post that read, "It would be unfortunate if celebrations to mark the 75th anniversary of Independence become a burden for the poor."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X